కార్లు, బస్సులపై అక్కడ బ్యాన్
కార్లు, బస్సులపై అక్కడ బ్యాన్
Published Thu, Jan 5 2017 7:48 PM | Last Updated on Tue, Sep 5 2017 12:30 AM
న్యూఢిల్లీ: ప్రపంచంలో అతి ఖరీదైన ప్రదేశాల్లో ఒకటిగా నిలుస్తున్న ఢిల్లీలోని కన్నాట్ ప్రాంతానికి కార్లు, బస్సులు నిలిపివేయనున్నారు. ఫిబ్రవరి నుంచి మూడు నెలల పాటు ఆ ప్రాంతానికి బస్సు, కార్లు వెళ్లడాన్ని అనుమతించమని ప్రభుత్వం చెప్పింది. వచ్చే నెలలో ఆవిష్కరించబోతున్న పైలెట్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా వీటిని నిలిపివేయనున్నట్టు తెలిసింది. 1993లో ఎడ్విన్ లుట్యెన్స్ ఈ వాణిజ్య ప్రాంతాన్ని నిర్మించారు. ట్రాఫిక్ను నియంత్రించడానికి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. కన్నాట్ ఏరియా పరిసర పార్కింగ్ ప్రాంతాలు శివాజీ స్టేడియం, బాబా ఖారక్ సింగ్ మార్గ్, పలికా పార్కింగ్ల నుంచి సైకిళ్లు, బ్యాటరీ ఆధారిత వెహికిల్స్ను 'పార్క్ అండ్ రైడ్' సర్వీసుల కోసం ఆఫర్ చేయనున్నారు.
కన్నాట్ ప్రాంతంలో మూడు నెలల వరకు నడకబాటలో ప్రయాణించే వారికే అనుమతిస్తామని పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా చర్చలు జరిపారు. ఈ వాణిజ్య ప్రాంత రూపురేఖలను మార్చడానికి, నీళ్లు సదుపాయాలను అభివృద్ధి చేయడంపై మంత్రి చర్చించారు. అంతేకాక పబ్లిక్ ప్లాజాలు, సైడ్ వాక్ కేఫ్లు, లైట్స్, స్ట్రీట్ ఫెస్టివల్ వంటి పలు అంశాలపై కేంద్రమంత్రి అధికారులతో చర్చించారు.
Advertisement
Advertisement