కోపం వచ్చినపుడు చేతిలో ఉన్నవి విసిరికొడుతుంటారా..? ఏ వస్తువునైనా పగులగొడుతుంటారా..? అలా పగులగొట్టడమే మీ ఉద్యోగమైతే..! అందుకు ఏడాదికి రూ.36 లక్షల జీతం ఇస్తే.. భలే బాగుంటుంది కదూ.. కోపం వచ్చినా రాకపోయినా మొబైల్ ఫోన్లు పగులగొడితే చాలు.. అదీ పార్ట్‌టైం జాబ్ లాగా.. మొబైల్ ఫోన్లను పరీక్షించేందుకు లండన్‌కు చెందిన టైగర్ మొబైల్ డాట్ కామ్ కంపెనీ ఈ జాబ్ ఆఫర్ చేస్తోంది. కొద్దిగా ఫోన్ టెక్నాలజీలో ప్రావీణ్యం ఉండి మొబైల్ రంగంలో అనుభవం ఉంటే ఆ జాబ్ మీ సొంతమే.. మరెందుకీ ఆలస్యం..!