రాజాపై సీబీఐ కేసు.. పలు ప్రాంతాల్లో సోదాలు | cbi files da case on raja, searches on at several areas | Sakshi
Sakshi News home page

రాజాపై సీబీఐ కేసు.. పలు ప్రాంతాల్లో సోదాలు

Published Wed, Aug 19 2015 3:50 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM

రాజాపై సీబీఐ కేసు.. పలు ప్రాంతాల్లో సోదాలు

రాజాపై సీబీఐ కేసు.. పలు ప్రాంతాల్లో సోదాలు

టెలికం శాఖ మాజీ మంత్రి ఎ.రాజాపై సీబీఐ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్కాంలో నిందితుడిగా ఉన్న రాజా గతంలో అరెస్టయ్యి, చాలా కాలం పాటు జైల్లోనే మగ్గి, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా.. తాజాగా రాజాతో పాటు మరో 16 మందిపై సీబీఐ వర్గాలు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసినట్లు సమాచారం.

 ఢిల్లీ, చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరు, పెరంబదూర్ సహా.. మొత్తం 20 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. డీఎంకే అధినేత ఎం.కరుణానిధికి ప్రియశిష్యుడిగా పేరొందిన ఎ.రాజాతో పాటు.. 2జీ స్కాంలో కరుణ కుమార్తె కనిమొళి కూడా నిందితురాలిగా ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement