
ఇక చైనా స్పేస్‌స్టేషన్
► మొట్టమొదటి కార్గో స్పేస్‌క్రాప్ట్ నింగిలోకి పంపుతున్న డ్రాగన్
► పూర్తయితే అమెరికా, రష్యాల సరసన చైనా
బీజింగ్: మొట్టమొదటి కార్గో స్పేస్‌క్రాప్ట్‌ని అంతరిక్షంలోకి పంపేందుకు చైనా సన్నాహాలు చేస్తోంది. టీయాన్జు-1 అనే స్సేస్‌క్రాప్ట్‌ను ఏప్రిల్ 20 నుంచి 24 వాతావరణం అనుకూలంగా ఉన్న సమయంలో కక్ష్యలోకి పంపేందుకు సిద్ధమవుతోంది. వెన్‌చాంగ్ లాంచింగ్ సెంటర్ నుంచి లాంగ్‌మార్చ్–7 వై2 రాకెట్ ద్వారా ఈ కార్గో స్పేస్‌క్రాఫ్ట్‌ను నింగిలోకి పంపుతున్నారు.
దీనిని అంతరిక్షంలోకి పంపడం పూర్తయితే అమెరికా, రష్యాల తర్వాత సొంత స్పేస్ స్టేషన్ కలిగిన దేశంగా చైనా ఆవిర్భవిస్తుంది. 2022 నాటికి తమ స్పేస్ స్టేషన్ తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందని చైనా ఇప్పటి ప్రకటించింది. ఈ స్పేస్‌క్రాఫ్ట్ ప్రయోగానికి సంబంధించిన పరీక్షలను శాస్త్రవేత్తలు పూర్తిచేశారని, ప్రయోగానికి వాతావరణం అనుకూలించడం మినహా మరే ఇతర అడ్డంకులు లేవని తెలిపింది.