అమెరికా ఆటో దిగ్గజానికి చైనా షాక్? | China to penalise US automaker for monopolistic behaviour, says Chinese Daily | Sakshi
Sakshi News home page

అమెరికా ఆటో దిగ్గజానికి చైనా షాక్?

Published Wed, Dec 14 2016 3:23 PM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

అమెరికా ఆటో దిగ్గజానికి చైనా షాక్? - Sakshi

అమెరికా ఆటో దిగ్గజానికి చైనా షాక్?

షాంఘై : చైనా అనుసరిస్తున్న విధానాలను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఎలాగైనా గట్టి షాకివ్వాలని డ్రాగన్ వ్యూహాలు పన్నుతోంది. ఈ నేపథ్యంలో ఓ అమెరికా ఆటో దిగ్గజానికి త్వరలోనే చైనా భారీ ఫైన్ విధించబోతుందని తెలుస్తోంది. కంపెనీ పేరు వెల్లడించని చైనా డైలీ న్యూస్పేపర్, ఓ అమెరికా ఆటో దిగ్గజం అనుసరిస్తున్న గుత్తాధిపత్య ధోరణికి త్వరలోనే జరిమానా పడుతున్నట్టు వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈ అమెరికా కంపెనీ  2014 నుంచి డిస్ట్రీబ్యూటర్లకు ధరలను నిర్ణయిస్తూ వస్తోందని ఇన్వెస్టిగేటర్ల విచారణలో తేలినట్టు చైనా జాతీయ అభివృద్ధి, సంస్కరణ కమిషన్( ఎన్డీఆర్సీ) డైరెక్టర్ ఝాంగ్ హ్యాన్డాంగ్ చెప్పారు.  ఈ జరిమానా విషయంలో ఎవరూ తప్పుడు వార్తకథనాన్ని చదవడం లేదని పేర్కొన్నారు. అయితే ఈ ఆర్టికల్ ఏ కంపెనీకి, ఎంత మొత్తంలో జరిమానా విధించబోతున్నారో పూర్తి వివరాలను వెల్లడించలేదు.
 
ఆటో దిగ్గజాలకు చైనా అతిపెద్ద మార్కెట్గా ఉంది. అమెరికా ఆటో దిగ్గజాలు జనరల్ మోటార్స్ కంపెనీ, ఫోర్డ్ మోటార్ వంటి కంపెనీలు ఈ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అయితే మీడియా ఊహాగానాలపై తాము స్పందించమని ఈ కంపెనీలు తేల్చేశాయి.  యాంటీ-మోనోపలి ఇన్వెస్టిగ్వేషన్లు ప్రారంభమైనప్పటి నుంచి ఆటో దిగ్గజాలకు ఈ ఎన్డీఆర్సీ ఏడో సార్లు  జరిమానా విధించింది. తైవాన్పై ఆధిపత్య ధోరణిగా చైనా అనుసరిస్తున్న 'వన్ చైనా' పాలసీపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన అనంతరం చైనా డైలీ ఈ వార్తాకథనాన్ని ప్రచురించడం గమనార్హం. తైవాన్ను బీజింగ్ తమలో ఒకటిగా భావిస్తోంది. అంతేకాక తైవాన్కు, అమెరికాకు 1979 నుంచి ఎలాంటి దౌత్యసంబంధాలు లేవు. కానీ ట్రంప్ గెలవగానే,  చైనాకు వ్యతిరేకంగా తైవాన్ను మార్చడానికి పలు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement