'ఓటమిని అంగీకరిస్తున్నాం' ఏఐసీసీ కార్యాలయం ఖాళీ!
'ఓటమిని అంగీకరిస్తున్నాం' ఏఐసీసీ కార్యాలయం ఖాళీ!
Published Sun, Dec 8 2013 11:31 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంగా దిశగా ప్రయాణిస్తోంది. ఓటమిని అంగీకరిస్తున్నాం. ఫలితాలను విశ్లేషించుకుంటాం అని కాంగ్రెస్ పార్టీ నేత జయంతి నటరాజన్ అన్నారు. మధ్యప్రదేశ్ , రాజస్థాన్ లో గెలిచిన అభ్యర్థులకు కృతజ్ఞతలు అని అన్నారు. ప్రజల తీర్పును శిరసావహిస్తాం అని అన్నారు. ఢిల్లీలో పార్టీకి లభించిన ప్రతికూల ఫలితాలపై సమీక్ష జరుపుతాం అని అన్నారు.
మధ్యప్రదేశ్ లో అధికారాన్ని మరోసారి చేజిక్కించుకునేందుకు బీజేపీ అడుగులేస్తుండగా, రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు సిద్ధమైంది. ఇక ఛత్తీస్ గఢ్ లో ఫలితాలు నువ్వా నేనా అనే రీతిలో ఉత్కంఠను కలిగిస్తున్నాయన్నారు. ఢిల్లీలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల తర్వాత కాంగ్రెస్ మూడవ స్థానంలో నిలిచింది.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీని గట్టి దెబ్బ కొట్టాయి. దీంతో న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం పూర్తిగా బోసిపోయింది. కొద్దిమంది మీడియా ప్రతినిధులు, పోలీసులు తప్ప నాయకులు అన్నవాళ్లు ఎవరూ ఆ దరిదాపుల్లో కూడా కనిపించడంలేదు. నాలుగు రాష్ట్రాలకు గాను ఒక్క ఛత్తీస్గఢ్లో మాత్రమే కొంత మేరకు ఆశ కనిపిస్తుండగా మిగిలిన మూడు రాష్ట్రాల్లో సోదిలోకి కూడా లేకుండా పోయింది. దీంతో జాతీయ స్థాయి నాయకులు కూడా పార్టీ కార్యాలయానికి హాజరు కాకుండా ముఖం చాటేశారు.
Advertisement
Advertisement