వినియోగదారుల విశ్వాసం తగ్గుతోంది | Consumer confidence in India declined in Q3: Nielsen | Sakshi
Sakshi News home page

వినియోగదారుల విశ్వాసం తగ్గుతోంది

Published Thu, Oct 31 2013 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM

Consumer confidence in India declined in Q3: Nielsen

న్యూఢిల్లీ: భారత్‌లో వినియోగదారుల విశ్వాసం తగ్గుతోంది. ఈ ఏడాది మూడో త్రైమాసిక కాలానికి భారత వినియోగదారుల విశ్వాసం, అంతకు ముందటి క్వార్టర్‌తో పోల్చితే తగ్గిందని  నీల్సన్ గ్లోబల్ సర్వే వెల్లడించింది. అయినప్పటికీ, ప్రపంచంలోనే అత్యంత జోరుగా ఉన్న మూడవ కన్సూమర్ మార్కెట్‌గా భారత్ అవతరించిందని ఈ సర్వే పేర్కొంది.  ఈ ఏడాది ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ 6 మధ్యకాలంలో నీల్సన్ సంస్థ 60 దేశాల్లో ఈ సర్వేను నిర్వహించింది. మొత్తం మీద సగానికి పైగా దేశాల్లో వినియోగదారుల విశ్వాసం పెరిగిందని ఈ సర్వే వెల్లడించింది. ఈ ఏడాది క్యూ2లో 118గా ఉన్న భారత కన్సూమర్ కాన్ఫిడెన్స్ స్కోర్ ఈ ఏడాది క్యూ3లో 112కు తగ్గిందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement