క్యాడ్ అంచనాల కంటే తగ్గొచ్చు: మాంటెక్
క్యాడ్ అంచనాల కంటే తగ్గొచ్చు: మాంటెక్
Published Mon, Oct 21 2013 12:57 AM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరంట్ అకౌంట్ లోటు(క్యాడ్) అంచనాల(జీడీపీలో 3.8%)కన్నా తక్కువగానే నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా చెప్పారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీని వెనక్కి తీసుకుంటే ఆ ప్రభావాన్ని తట్టుకోగల స్థాయిలోనే భారత్ ఉందని వివరించారు. దేశంలోకి వచ్చే, దేశం నుంచి బయటకు వెళ్లే విదేశీ మారక ద్రవ్య తేడాను క్యాడ్‌గా వ్యవహరిస్తారు. గత ఆర్థిక సంవత్సరంలో క్యాడ్ జీడీపీలో 4.8 శాతం(8820 కోట్ల డాలర్లుగా) నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీనిని 3.8 శాతానికి(7,000 కోట్ల డాలర్లు) తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Advertisement