పదిరోజుల్లో మధ్యంతర భృతిపై నిర్ణయం: మంత్రి ఆనం | Decision will take on Interim allowance in ten days, says anam ramanarayana reddy | Sakshi
Sakshi News home page

పదిరోజుల్లో మధ్యంతర భృతిపై నిర్ణయం: మంత్రి ఆనం

Published Sat, Dec 14 2013 8:36 PM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM

పదిరోజుల్లో మధ్యంతర భృతిపై నిర్ణయం: మంత్రి ఆనం

పదిరోజుల్లో మధ్యంతర భృతిపై నిర్ణయం: మంత్రి ఆనం

హైదరాబాద్: పదిరోజుల్లో మధ్యంతర భృతిపై నిర్ణయం తీసుకోనున్నట్టు ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఉద్యోగసంఘాలతో మంత్రి వర్గ ఉపసంఘం భేటీలు ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశాల్లో ఉద్యోగులు 45-50 శాతం వరకూ మధ్యంతర భృతిని కోరినట్టు చెప్పారు.

మధ్యంతర భృతిపై చర్చించేందుకు...  ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం చర్చలకు పిలిచింది. మంత్రి మండలి ఉప సంఘం ఈ సాయంత్రం సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, కొండ్రు మురళి, ఉత్తమకుమార్ రెడ్డి హాజరయ్యారు. వారితోపాటు ఉద్యోగ సంఘాల నేతలు కూడా హజరయ్యారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement