'నాకు జైట్లీ బ్యాంకు, ట్యాక్స్ వివరాలు కావాలి' | Defamation Case: Arvind Kejriwal Seeks Arun Jaitley's Bank, Tax Details In Petition | Sakshi
Sakshi News home page

'నాకు జైట్లీ బ్యాంకు, ట్యాక్స్ వివరాలు కావాలి'

Published Sun, Feb 26 2017 12:00 PM | Last Updated on Tue, Sep 5 2017 4:41 AM

'నాకు జైట్లీ బ్యాంకు, ట్యాక్స్ వివరాలు కావాలి'

'నాకు జైట్లీ బ్యాంకు, ట్యాక్స్ వివరాలు కావాలి'

న్యూఢిల్లీ : ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బ్యాంకు, ఆదాయపు పన్ను వివరాలను బహిర్గతం చేయాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఢిల్లీ హైకోర్టులో ఈ మేరకు ఓ పిటిషన్ను కేజ్రీవాల్ దాఖలు చేశారు. అరుణ్‌ జైట్లీ బ్యాంకు వివరాలతో పాటు, ఆయన భార్య, కూతురు, అల్లుడికి సంబంధించిన 1999-2014 వరకున్న బ్యాంకు వివరాలన్నింటిన్నీ ఆయన కోరారు. ఢిల్లీ క్రికెట్ బాడీ డీడీసీఏకు అధినేతగా ఉన్నప్పుడు జైట్లీ అవినీతికి పాల్పడ్డారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ ఆరోపణల వల్ల తనకు పరువునష్టం కలిగిందని జైట్లీ, కేజ్రీవాల్, ఇతర ఐదుగురు ఆప్ నేతలపై పరువునష్టం కేసు దాఖలు చేశారు.
 
అయితే డీడీసీఏకు బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు తను ఎలాంటి వ్యక్తిగత ఆర్థిక లబ్దికి పాల్పడదని జైట్లీ నిరూపించుకోవాలంటే, ఈ డాక్యుమెంట్లు అన్ని అవసరమని కేజ్రీవాల్ కోర్టుకు విన్నపించారు. ఈ కేసును ఢిల్లీ హైకోర్టు మార్చి 6,7 తేదీల్లో విచారించనుంది. 2013 వరకు మొత్తం 13 ఏళ్ల పాటు జైట్లీ డీడీసీఏకు అధినేతగా ఉన్నారు.  ఆప్ నేతలే కావాలనే తనపై తప్పుడు నిందలు వేస్తున్నారని జైట్లీ మండిపడ్డారు. ఈ విషయంలో కేజ్రీవాల్పై క్రిమినల్ పరువునష్టం దావా కూడా వేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement