సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురు | SC Refuses to Stay Defamation Case Filed by Jaitley Against Kejriwal | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురు

Published Tue, Nov 22 2016 4:10 PM | Last Updated on Sat, Sep 15 2018 3:04 PM

సుప్రీంకోర్టులో  కేజ్రీవాల్ కు చుక్కెదురు - Sakshi

సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురు

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. ఆయనపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం దావా కేసు విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ కేసు విచారణపై స్టే విధించలేమంటూ పిటిషన్ ను రద్దు చేస్తూ కేజ్రీవాల్ కు గట్టి ఝలక్ ఇచ్చింది. ‘మేం తీర్పులు చూశాం. కింది స్థాయికోర్టు, ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పుల్లో మేం జోక్యం చేసుకోబోం. ఈ పిటిషన్ ను రద్దు చేస్తున్నాం’ అని మంగళవారం కేజ్రీవాల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. డీడీసీఏలో తాను అక్రమాలకు పాల్పడ్డానంటూ కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలతో తన పరువుకు భంగం కలింగిందని అరుణ్ జైట్లీ పరువు నష్టం దావా వేశారు.

తన కుటుంబసభ్యులపై కూడా కేజ్రీవాల్ ఆరోపణలు చేస్తున్నారని ఆ పిటీషన్ లో తెలిపారు. అరుణ్ జైట్లీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డీడీసీఏలో దారుణ అక్రమాలు, అవినీతి జరిగాయని కేజ్రీవాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. డీడీసీఏ అధికారులు లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసు నుంచి జైట్లీని తప్పించడానికే తన కార్యాలయంలో సీబీఐ దాడులు చేయించారని విమర్శించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలను ఖండించిన అరుణ్ జైట్లీ ఆయనపై పరువు నష్టం కేసు వేశారు. విచారణను రద్దు చేయాలని గతంలో ఈ కేసును విచారిస్తున్న కింది స్థాయి కోర్టుల్లో పిటిషన్ వేసిన కేజ్రీవాల్కు నిరాశ ఎదురైన విషయం తెలిసిందే. తాజాగా ఉన్నత న్యాయస్థానంలో కూడా అదే పరిస్థితి ఎదురైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement