
మీ భార్య ఎవరో చెప్పరేం?: దిగ్విజయ్ సింగ్
మహిళా దినోత్సవం నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఇదే అంశంపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై వ్యక్తిగత విమర్శలకు దిగారు.
మోడీపై దిగ్విజయ్ వ్యక్తిగత విమర్శలు
న్యూఢిల్లీ: మహిళా దినోత్సవం నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఇదే అంశంపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. ‘‘మహిళలంటే మీ హృదయంలో కొంచెం మర్యాదైనా ఉందా? ఉంటే.. ఎన్నికల దరఖాస్తులో మీ భార్య పేరు ఎందుకు రాయకుండా ఖాళీగా వదిలేశారు? పాపం యశోదాబెన్ (మోడీ భార్యగా భావిస్తున్న మహిళ) ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈయన మనసున్న మారాజే అయితే ఆమెను ఒక బంగళాలో పెట్టి.. అవసరమైన సదుపాయాలు ఎందుకు కల్పించడం లేదు? సొంత భార్య బాగోగులు చూసుకోలేని మీరు.. ఇక దేశాన్నేం కాపాడతారు?’’ అని శనివారమిక్కడ విమర్శించారు.