డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చెప్పారు.
హైదరాబాద్: డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చెప్పారు. సీఎం కేసీఆర్ శనివారం సాగునీటి శాఖపై సమీక్ష నిర్వహించారు.
రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్టు కేసీఆర్ చెప్పారు. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు రక్షిత మంచి నీరు అందిస్తామని తెలిపారు. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు భూసేకరణ కోసం మరో 100 కోట్లు రూపాయలు కేటాయించనున్నట్టు కేసీఆర్ వెల్లడించారు.