
ప్రధానికి 50 వేల డీఎన్ఏలు!
పాట్నా: తన డీఎన్ఏలో ఏదో తేడా ఉందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించడం పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. మోదీ వెంటనే తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్న ఆయన ఇప్పుడు ఏకంగా 50 వేలమంది బీహారీల డీఎన్ఏలను మోదీకి పంపిస్తామని, కావాలంటే వాటన్నింటిని పరీక్ష చేసి చూసుకోవాలని హితవు పలికారు.
తనపై అనవసర ఆరోపణలు చేసిన నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భాగంగా తాము 50 వేలమంది డీఎన్ఏలను ప్రధాని మోదీకి పంపించాలనుకుంటున్నామని సోమవారం ఉదయం ట్విట్టర్లో ట్వీట్ చేశారు. గత వారం మోదీ బీహార్లోని ముజఫర్ పూర్ పర్యటనలో పాల్గొన్న సందర్భంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో తోటి నాయకులను గౌరవించే అలవాటు ఇతర నేతలకు ఉంటుందని, కానీ నితీశ్లో మాత్రం అలాంటి లక్షణాలు కనిపించడం లేదని, ఆయన డీఎన్ఏలో ఏదో లోపం ఉందని ఆరోపించారు. దీనిపై నితీశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.