రాజ్యసభ ఖాళీలకు 19న ఎన్నికలు | Elections in 8 Rajya Sabha seats on June 19 | Sakshi
Sakshi News home page

రాజ్యసభ ఖాళీలకు 19న ఎన్నికలు

Published Wed, May 28 2014 1:53 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

Elections in 8 Rajya Sabha seats on June 19

* నేడు ఉమ్మడి రాష్ట్ర సభ్యుల విభజన

సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాల కోసం జూన్ 19న ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 9 స్థానాలు ఖాళీగా ఉండగా 8 స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించనుంది. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మరణించడంతో ఏర్పడిన ఖాళీని మినహాయించి ఈ నోటిఫికేషన్‌ను జారీ చేశారు.

ఈ స్థానం కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌కు చెందుతుందా? లేక తెలంగాణకు చెందుతుందా? అన్న అంశాన్ని నిర్ధారించాక దీనికి సైతం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇలావుండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులను ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పేర్కొన్న విధంగా లాటరీ పద్ధతిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు బుధవారం కేటాయించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement