20 ఏళ్ల తర్వాత తగ్గిన ఫోన్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: ఇరవై ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత్ మొబైల్ ఫోన్ అమ్మకాలు తగ్గాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికం(జనవరి-మార్చి)లో మొబైల్ ఫోన్ అమ్మకాలు 14.5 శాతం తగ్గాయని సైబర్ మీడియా రీసెర్చ్ కన్సల్టెన్సీ నివేదిక వెల్లడించింది. గతేడాది చివరి త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 6.2 కోట్ల మొబైల్ ఫోన్లు అమ్ముడవగా, ఈ ఏడాది క్వార్టర్ లో 5.3 కోట్ల ఫోన్లు సేల్ అయ్యాయి.
స్మార్ట్ ఫోన్ అమ్మకాలు కూడా 7.4 శాతం పడిపోవడం గమనార్హం. ఇదే సమయంలో తక్కువ ధర కలిగిన ఫీచర్ ఫోన్ అమ్మకాలు 18.3 శాతం క్షీణించాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు మందగించడం తయారీదార్లను కలవరపెడుతోంది.