
ఇవేమీ తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవు: జైపాల్
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రాజ్యాంగ పరమైన లోపాలు ఉంటే కోర్టుకు వెళ్లొచ్చుని, కోర్టులో న్యాయం కోరవచ్చంటూ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు రాజ్యాంగ ప్రక్రియకే అడ్డుతగులుతున్నారంటూ ఆయన విమర్శించారు. శాసనసభలో బిల్లుపై చర్చించకుండా శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు శాఖ మార్చడమనేది తెలంగాణ ప్రక్రియను అడ్డదారిపట్టించేందుకేనని జైపాల్ రెడ్డి మండిపడ్డారు.
కానీ, ఇవేమీ తెలంగాణ ప్రక్రియను అడ్డుకోవని ఆయన చెప్పారు. జనవరి 23 రాత్రి 12 గంటలు దాటితే తెలంగాణ బిల్లు అసెంబ్లీ చేతిలో ఉండదని జైపాల్ రెడ్డి హెచ్చరించారు. ఆ తరువాత పార్లమెంటు చేతిలోకి తెలంగాణ బిల్లు వస్తుందని చెప్పారు. కాగా, ఫిబ్రవరి మొదటి వారంలో పార్లమెంటులోకి తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.