
ముషారఫ్ కు పాకిస్థాన్ ప్రభుత్వం షాక్
ఇస్లామాబాద్: మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు పాకిస్థాన్ ప్రభుత్వం షాకిచ్చింది. సౌదీ అరేబియా వెళ్లేందుకు ఆయనకు అనుమతి నిరాకరించింది. ఇటీవల మృతి చెందిన సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ తనకు సోదరుడు వంటివాడని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సౌదీ అరేబియా వెళ్లేందుకు ముషారఫ్ అనుమతి కోరగా ప్రభుత్వం తిరస్కరించింది.
71 ఏళ్ల ముషారఫ్ పాకిస్థాన్ లో పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. ఐదేళ్లు దుబాయ్ లో ప్రవాస జీవితం గడిపిన ముషారఫ్ పాకిస్థాన్ సాధారణ ఎన్నికల్లో పాల్గొనేందుకు 2013లో స్వదేశానికి తిరిగొచ్చారు.