రామనాథపురం(తమిళనాడు): ఓ పరమ పిసినారి తన కుటుంబాన్ని అడవులపాలు చేసిన ఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో జరిగింది. గత కొన్నేళ్లుగా ఇంటి అద్దెను చెల్లించకుండా కాలం గడుపుతూ వస్తున్న పిసినారిపై ఇంటి యజమాని ఒత్తిడి పెంచడంతో సదరు వ్యక్తి తన భార్యా పిల్లలను నమ్మకంగా తీసుకెళ్లి సమీపంలోని అడవిలో వదిలేసి అదృశ్యమయ్యాడు. సమాచారం అందుకుని రంగంలోకి దిగిన పోలీసులు బాధితులను రక్షించారు. రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు.. పరమ పిసినారిగా పేరు తెచ్చుకున్న రాజ్‌కుమార్‌కు భార్య వసంత(24), కుమార్తె నందిని(5), కుమారుడు కామేష్(7) ఉన్నారు. గడిచిన కొంతకాలంగా ఇంటి అద్దె చెల్లించడంలేదు.
దీంతో సదరు యజమాని రాజ్‌కుమార్‌పై ఒత్తిడి పెంచడం, కుమార్ వ్యక్తిత్వం తెలిసిన స్థానికులు ఎవరూ ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో సదరు వ్యక్తి తన భార్యా పిల్లలను తీసుకుని కటూరని అడవికి వెళ్లాడు. కొంత సేపటికి వారిని అక్కడే వదిలి తాను వె ళ్లిపోయాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన వసంత ఆమె పిల్లలను సమీపంలోని వారు ఆదుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన అధికారులు బాధితులను ప్రభుత్వ వసతి గృహానికి చేర్చి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
భార్యా పిల్లలను అడవిలో వదిలేసిన పిసినారి
Published Tue, Aug 27 2013 3:06 AM | Last Updated on Fri, Jul 27 2018 2:21 PM
Advertisement
Advertisement