
'ఎయిర్ పోర్ట్ కు ఎన్టీఆర్ పేరు పెట్టింది నేను కాదు'
న్యూఢిల్లీ: శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టింది తాను కాదని పౌరవిమానయాన శాఖ మంత్రి పి. అశోక్గజపతిరాజు తెలిపారు. ఎన్టీఆర్ పేరు పెట్టాలన్నది 1999 నాటి నిర్ణయమని చెప్పారు. దీనిపై అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేసి నిర్ణయం తీసుకున్నాయన్నారు. అప్పటి కేబినెట్ నిర్ణయాన్నే ఇప్పుడు అమలు చేశామని వెల్లడించారు.
ఎన్టీఆర్ తో సహా మనమంతా భారతీయులుమన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్ తన కుమారుడికి ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నారని అన్నారు. ఎన్టీఆర్ పేరు తిరస్కరిస్తూ తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అశోక్గజపతిరాజు తెలిపారు.