ప్రకాశం జిల్లాలో ఏర్పాటుచేయ తలపెట్టిన ట్రిపుల్ ఐటీకి దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. విజయవాడలో శుక్రవారం ఉదయం మొదలైన ఏపీ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా.. 8 గంటల పాటు కొనసాగింది. అబ్దుల్ కలాం పేరిట విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఇవ్వాలని కూడా కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.
- ఏపీ కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు ఇలా ఉన్నాయి...
- రిషితేశ్వరి కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం
- రిషితేశ్వరి కుటుంబానికి రాజమండ్రిలో 500 గజాల స్థలం
- రాష్ట్రంలో రెండు లక్షల ఇళ్ల నిర్మాణానికి ఆమోదం
- ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 2.5 లక్షల వ్యయం
- సంక్షేమ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలి
- అమరావతి ప్రాంతంలో మంత్రులకు క్యాంపు కార్యాలయాలు
- శాఖలను త్వరగా అమరావతికి తరలించాలి
- రాజీవ్ స్వగృహలో 2,894 ఇళ్ల నిర్మాణం
- ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద గ్రామీణప్రాంతాల్లో రూ. 5,500 కోట్లతో 2లక్షల ఇళ్లు
- ఆగస్టు 15న పట్టిసీమ ఫేజ్-1 ప్రారంభం