విశాల్‌కు మద్దతుగా కిరణ్‌ మజుందార్‌ షా | Infosys: Kiran Mazumdar-Shaw defends Vishal Sikka, board decisions | Sakshi
Sakshi News home page

విశాల్‌కు మద్దతుగా కిరణ్‌ మజుందార్‌ షా

Published Fri, Feb 10 2017 12:13 PM | Last Updated on Tue, Sep 5 2017 3:23 AM

విశాల్‌ సిక్కా బోర్డు వివాదంలో బయోకాన్ చైర్‌ పర్సన్, ఇన్ఫీ స్వతంత్ర డైరక్టరు కిరణ్‌ మజుందార్‌ షా విశాల్‌ సిక్కాకు మద్దతుగా నిలుస్తున్నారు.

ముంబై: విశాల్‌ సిక్కా బోర్డు వివాదంలో బయోకాన్ చైర్‌ పర్సన్, ఇన్ఫీ  స్వతంత్ర డైరక్టరు  కిరణ్‌ మజుందార్‌ షా  విశాల్‌ సిక్కాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇన్ఫోసిస్ బోర్డు నాయకత్వం విభేదాలు ఆందోళన కలిగించే అంశమని అంగీకరించారు. అయితే  బోర్డు చాలా సమన్వయంతో   కూడుకున్నదంటూ ఇన్ఫీ బోర్డుపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అయితే ఫౌండర్స్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాలు కార్పొరేట్‌ గవర్నెన్స్‌ కాదనీ.. అభిప్రాయ భేదాలని వ్యాఖ్యానించారు.  అలాగే తీవ్రమైన​ సముపార్జన వ్యూహాలు విశాల్‌కు  ఉన్నాయని తాను భావించడంలేదన్నారు.  లక్ష్యాల సాధనలో ప్రమోటర్ల  మద్దతు   ఆయనకు బలంగా ఉందన్నారు.  
కాగా  టాటా -మిస్త్రీ బోర్డు వివాదం తరహాలో ఇన్ఫోసిస్‌లో కూడా మేనేజ్మెంట్‌లో విబేధాలు తలెత్తుతున్నాయనే వార్తలు సంచలనంగా మారాయి. కంపనీకి మొదటి నాన్ ప్రమోటర్ సీఈఓ అయిన విశాల్ శిక్కాకు.. ఈ సంస్థ వ్యవస్థాపకులకు మధ్య నిర్ణయాత్మక విధానాల విషయంలో విబేధాలు మరింత ముదిరాయన్న వార్తలు ఆందోళన  పుట్టిస్తున్నాయి.  సంస్థ విలువలకు అనుగుణంగా శిక్కా నడుచుకోవడం లేదని కొందరు ప్రమోటర్ షేర్‌హోల్డర్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు కూడా.  అటు ఇన్పీతొలి ఛైర్మన్‌ నారాయణ మూర్తికూడా  కార్పొరేట్‌ గవర్నెన్స్‌ క్రమంగా  క్షీణిస్తోందని ఆందోళన వ్యక‍్తం చేశారు. ఈ పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement