ఐఓటీ నెట్‌వర్క్స్ హ్యాకింగ్‌పై సైబర్ క్రిమినల్స్ గురి!
సైబర్ సెక్యూరిటీ సంస్థ వెబ్‌సెన్స్ హెచ్చరిక
న్యూఢిల్లీ: ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’ (ఐఓటీ) నెట్‌వర్క్స్ హ్యాకింగ్‌కు సైబర్ క్రిమినల్స్ రెడీగా ఉన్నారని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ వెబ్‌సెన్స్ హెచ్చరించింది. దీని కోసం వారు పలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారని తెలిపింది. మానవుల ప్రమేయం లేకుండా కేవలం ఐపీ అనుసంధానంతో తమలో తాము మాట్లాడగలిగే (సమాచార మార్పిడి) పరికరాల సాంకేతిక వ్యవస్థనే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) అని పిలుస్తారు. ఈ వ్యవస్థలో ఇంటెలిజెన్స్ సిస్టమ్స్, నెట్‌వ ర్క్ పరికరాలు, కనెక్టివిటీ సేవలు, డాటా సమగ్రత వంటివి కూడా ఉంటాయి. ‘ఐఓ టీ వృద్ధి చెందుతున్న మార్కెట్. ఇది కంపెనీలకు ఒక భారీ వ్యాపార అవకాశం. అలాగే దీనికి సైబర్ క్రిమినల్స్ నుంచి చాలా ప్రమాదం పొంచి ఉంది’ అని వెబ్‌సెన్స్ రీజినల్ డెరైక్టర్ (ఇండియా, సార్క్) సురేంద్ర సింగ్ అన్నారు.
ఐటీ వినియోగంలో భారత్ బ్యాక్: డబ్ల్యూఈఎఫ్
జెనీవా: అధునాతన ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీలను (ఐసీటీ) సామాజిక, ఆర్థిక ప్రయోజనాల కోసం సమర్ధంగా ఉపయోగించుకోవడంలో భారత్ అంతకంతకూ విఫలమవుతోంది. ఇందుకు సంబంధించి ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 143 దేశాలతో రూపొందించిన అంతర్జాతీయ నెట్‌వర్క్‌డ్ రెడీనెస్ ఇండెక్స్ (ఎన్‌ఆర్‌ఐ)లో ఆరు స్థానాలు దిగజారి 89వ స్థానానికి పడిపోయింది. 2013లో 68వ స్థానంలో ఉన్న భారత్, గతేడాది 83వ ర్యాంకుకు దిగజారింది.