వందేళ్ల వెలుగులకు పునాది | Jagdish Reddy fired on janareddy in assembly on power project | Sakshi
Sakshi News home page

వందేళ్ల వెలుగులకు పునాది

Published Sun, Dec 18 2016 2:32 AM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM

వందేళ్ల వెలుగులకు పునాది

వందేళ్ల వెలుగులకు పునాది

మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: జగదీశ్‌రెడ్డి
మా ప్రణాళికతోనే గృహాలకు 24 గంటలు, సాగుకు 9 గంటల విద్యుత్‌
ఏపీ సీఎంకు జానారెడ్డి వంతపాడుతున్నారని విమర్శ
ఇప్పుడొచ్చిన వెలుగులన్నింటికీ పునాదులు మావే: జానారెడ్డి


సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణను మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నామని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి శాసనసభలో చెప్పారు. గత అరవైఏళ్ల నష్టాన్ని పూడుస్తూ.. వందేళ్ల వెలుగులకు పునాదులు వేస్తున్నామన్నారు.  గృహాలకు 24 గంటలు, సాగుకు 9 గంటలు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు చర్యలు చేపట్టామ ని తెలిపారు. శనివారం అసెంబ్లీలో విద్యుత్‌ అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో జగదీశ్‌ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ‘కాకతీయ థర్మల్‌ ప్రాజెక్టు నుంచి 2,400 మెగావాట్లు, సింగరేణిలో 1,200, జూరాలలో 240, పులిచింతలలో 30 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేశాం.

సోలార్‌ ద్వా రా వెయ్యి మెగావాట్లు, పవన విద్యుత్‌ ద్వారా 99 మెగావాట్లను  ఉత్పత్తి చేస్తున్నాం. మణు గూరు, కొత్తగూడెం, దామరచర్ల ప్రాజెక్టుల ద్వారా 5,880 మెగావాట్లు, ఎన్టీపీసీ 4,000, సౌర విద్యుత్‌ ద్వారా 2,200 మెగావాట్ల విద్యు దుత్పత్తికి పనులు మొదలయ్యాయి’ అని పే ర్కొన్నారు. టీఎస్‌ ఐపాస్‌తో పరిశ్రమల విద్యు త్‌ డిమాండ్‌ 2 వేల మెగావాట్లు పెరిగిందని, గత సెప్టెంబర్‌లో రాష్ట్రంలో అత్యధికంగా 8,484 మెగావాట్ల డిమాండ్‌ రికార్డయిందని తెలిపారు. ఎత్తిపోతల పథకాలకు 7,500 మెగా వాట్లు అవసరమని, ఆ మేరకు సరఫరా చేసే లా చర్యలు మొదలుపె ట్టామని వివరించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఒక్క సెకను కూడా కరెంట్‌ పోని పరిస్థితి తెస్తామని చెప్పారు. విద్యుత్‌ శాఖలో పని చేస్తున్న 20 వేల మంది ఔట్‌సోర్సింగ్‌/కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీ కరించేందుకు సీఎం నిర్ణ యం తీసుకున్నారని.. ఇప్పటికే 1,175 మంది జేఎల్‌ఎంఈలను క్రమబద్ధీకరించారన్నారు.

పక్క రాష్ట్ర సీఎంపై జానాకు ప్రేమ
ప్రతిపక్ష నేత జానారెడ్డిపై జగదీశ్‌రెడ్డి విరుచు కుపడ్డారు. జానారెడ్డి పక్క రాష్ట్ర సీఎంకు వంత పాడుతున్నారని, ఆ రాష్ట్రం తెలంగాణపై చేసిన కుట్రలు మరిచి ప్రేమ కనబరుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని చీకట్లో ఉంచిన తోడు దొంగలు ఈ చర్చలో తలెత్తుకునే పరిస్థితి లేదని తెలిసి పారిపోయారని వ్యాఖ్యానించారు.

ప్రణాళిక లేకుంటే గ్రిడ్‌లాప్రభుత్వం కూలుతుంది: జానారెడ్డి
తెలంగాణ ఏర్పాటు తర్వాత అదనంగా ఒక్క యూనిట్‌ విద్యుదుత్పత్తి జరగలేదని... ఇటీవ ల అందుబాటులోకి వచ్చిన 2 వేల మె.వా. విద్యుత్‌కు తామే పునాదులు వేశామని జానారె డ్డి స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం దేశమంతా అవస రానికి మించి విద్యుత్‌ ఉంది. దానికి కారణం మేము, మా ప్రభుత్వాలు కాదా? మాహయాం లో మొదలుపెట్టిన విద్యుత్‌ కేంద్రాల్లోనే నేడు ఉత్పత్తి జరుగుతోంది’ అని పేర్కొన్నారు. సరైన ప్రణాళిక లేకుంటే గ్రిడ్‌ కుప్పకూ లినట్లే ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు.

రెండోమారు వాకౌట్‌
విద్యుత్‌ అంశంపై 40 నిమిషాలు మాట్లాడిన జానారెడ్డి.. అనంతరం సభ నుంచి మరోసారి వాకౌట్‌ చేశారు. ‘మా సభ్యులు సభలో లేనప్పుడు ఇంతకు మించి మాట్లాడటం సబబు కాదు. సభ గౌరవంగా జరగాలంటే కాంగ్రెస్‌ సభ్యులపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలి.’’ అని డిమాండ్‌ చేస్తూ సభ నుంచి వెళ్లిపోయారు. ఆ సమయంలో సభలోనే ఉన్న ఉత్తమ్‌ కూడా బయటికి వెళ్లారు. మాట్లాడిందంతా మాట్లాడి, ప్రభుత్వం సమాధానం చెప్పే సమయంలో వాకౌట్‌ చేయడం సరికాదని మంత్రి కేటీఆర్‌ కాంగ్రెస్‌ సభ్యులకు సూచించారు.

ఒక్క యూనిట్‌ పెరగలేదు: బీజేపీ
రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఒక్క యూనిట్‌ విద్యుత్‌ అదనంగా ఉత్పత్తి చేయలేదని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 13 ఏళ్ల కనిష్ట ఉత్పత్తికి పడిపోయామని, వ్యవసాయ వినియోగం పడిపోయిందన్నారు. వ్యవసాయానికి 9 గంటలు ఇస్తున్నా మని చెబుతున్నా 6 గంటలకు మించి ఇవ్వడం లేదన్నారు.

హైదరాబాద్‌లో భారీగా విద్యుత్‌ కోతలు
హైదరాబాద్‌లో విద్యుత్‌ కోతలు ఎక్కువగా ఉన్నాయని.. ఈ ఏడాది 6,518 బ్రేక్‌డౌన్‌లు నమోదయ్యాయని ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ స్పష్టం చేశా రు. సౌర విద్యుత్‌ ఉత్పత్తి పెంచాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య కోరగా.. ఉద్యోగుల క్రమబద్ధీకరణ వేగిరం చేయాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య కోరారు.

విద్యుత్‌పై చర్చకు ఒకే ఒక్కడు
కాంగ్రెస్‌ సభ్యులు వారించినా సభకు వెళ్లి మాట్లాడిన జానా..
సాక్షి, హైదరాబాద్‌: తమ పార్టీ ఎమ్మెల్యేలను అప్రజాస్వామికంగా సస్పెండ్‌ చేసినందున విద్యు త్‌పై చర్చలో పాల్గొనాల్సిన అవసరం లేదని కాంగ్రెస్‌ మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయించినవారిపై చర్యలు తీసుకోవాలని కోరిన సభ్యులను సస్పెండ్‌ చేసిన తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జానారెడ్డి చాంబర్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. వి ద్యుత్‌పై చర్చలో జానారెడ్డి పాల్గొనాలా? వద్దా అన్న అంశంపై చర్చ జరిగింది. విద్యుత్‌పై చర్చ ను బహిష్కరించాలని సభ్యులు సూచించారు. సభ్యుల ప్రతిపాదనను జానారెడ్డి వ్యతిరేకిం చారు. విద్యుత్‌ వంటి సమస్యపై మాట్లాడే అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని, ప్రభుత్వా న్ని ఎండగట్టే అవకాశాన్ని వాడుకుందామని వ్యాఖ్యానించారు. మెజారిటీ సభ్యుల అభిప్రాయా లను పట్టించుకోకుండానే సభలోకి వెళ్లి జానారెడ్డి మాట్లాడారు. తర్వాత వాకౌట్‌ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement