జేఈఈ అడ్వాన్స్‌డ్‌: మోహన్‌కు టాప్‌ ర్యాంక్‌! | JEE Advanced 2017 Result | Sakshi

జేఈఈ అడ్వాన్స్‌డ్‌: మోహన్‌కు టాప్‌ ర్యాంక్‌!

Published Sun, Jun 11 2017 1:49 PM | Last Updated on Tue, Sep 5 2017 1:22 PM

జేఈఈ అడ్వాన్స్‌డ్‌: మోహన్‌కు టాప్‌ ర్యాంక్‌!

జేఈఈ అడ్వాన్స్‌డ్‌: మోహన్‌కు టాప్‌ ర్యాంక్‌!

హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాలను మద్రాస్‌ ఐఐటీ ఆదివారం వెల్లడించింది. ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లతోపాటు కేంద్రం ఆధ్వర్యంలోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన ఈ పరీక్షల్లో చండీగఢ్‌కు చెందిన సర్వేష్‌ మెహత్వానీ ఆలిండియా మొదటి ర్యాంకు సాధించగా, పుణెకు చెందిన అక్షత చుఘ్‌ రెండో ర్యాంకు సాధించాడు. అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షగా పేరొందిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో హైదరాబాద్‌కు చెందిన మోహన్‌ అభ్యాస్‌ ఆలిండియా 64వ ర్యాంకు సాధించాడు. హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి నిఖిల్‌ 248వ ర్యాంకు సాధించాడు.

ఇటీవల తెలుగు రాష్ట్రాల ఎంసెట్‌ పరీక్షల్లోనూ మోహన్‌ అభ్యాస్‌ సత్తా చాటిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎంసెట్‌లో ఐదో ర్యాంకు సాధించిన మోహన్‌.. ఏపీ ఎంసెట్‌లో మొదటి ర్యాంకు సాధించాడు. అతని విద్యా ప్రతిభకు గుర్తింపు ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్‌ అవార్డును సైతం అతను అందుకున్నాడు. అతనికి యంగ్‌ అఛీవర్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ అవార్డును సాక్షి అందజేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement