
'టీ-బిల్లును ఓడించడం సీఎం చేతిలో లేదు'
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లు త్వరలోనే అసెంబ్లీకి వస్తుందని మంత్రి డీకే అరుణ తెలిపారు. శాసనసభలో తెలంగాణ బిల్లును ఓడించడం ముఖ్యమంత్రి చేతిలో లేదని ఆమె అన్నారు. శాసనసభలో కేవలం తెలంగాణ బిల్లుపై చర్చ మాత్రమే జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్తో సమావేశం ముగిసిన ఆమె విలేకరులతో మాట్లాడారు.
ఈనెల 12న హైదరాబాద్ వస్తున్నట్లు దిగ్విజయ్ సింగ్ తనతో చెప్పారన్నారు. తాము విడిపోతామంటే కలిసుందామని సీమాంధ్రులు అనడం ఎంతవరకు సబబు అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చేలోపు బలప్రదర్శనకు తెలంగాణ నాయకులు సిద్ధమవుతున్నట్టు సమాచారం.