టీడీపీ రోగిష్టి పార్టీ: కొడాలి నాని | Kodali Nani slams Chandrababu naidu | Sakshi
Sakshi News home page

టీడీపీ రోగిష్టి పార్టీ: కొడాలి నాని

Published Sun, Aug 20 2017 12:58 PM | Last Updated on Fri, Oct 19 2018 8:10 PM

టీడీపీ రోగిష్టి పార్టీ: కొడాలి నాని - Sakshi

టీడీపీ రోగిష్టి పార్టీ: కొడాలి నాని

- చంద్రబాబు పరిస్థితి కంటే భిన్నంగా లేదు
- నంద్యాలలో గెలిచేది వైఎస్సార్‌సీపీనే


నంద్యాల:
‘తెలుగుదేశం ఓ రోగిష్టిపార్టీ. దాని అధ్యక్షుడు చంద్రబాబు కండిషన్‌ కంటే భిన్నంగా ఏమీ లేదు’ అంటూ అధికారపక్షంపై నిప్పులు చెరిగారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. వైఎస్‌ జగన్‌ను ఎదుర్కోలేక 10 మంది మంత్రులు, 50 మంది ఎమ్మెల్యేలు, కొడుకు, బావమరిదిలను రంగంలోకి దింపిన చంద్రబాబు చివరికి రిగ్గింగ్‌తో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి తరఫున నాని ఆదివారం ప్రచారం నిర్వహించారు.

‘‘మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పార్టీని ఆక్రమించుకున్న వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు నంద్యాలలో వందల మందిని రంగంలోకి దింపినా ఫలితం లేదని గ్రహించారు. అందుకే ధన,అధికార బలంతో రిగ్గింగ్‌ చేసైనా గెలవాలని అనుకుంటున్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా ఇక్కడ గెలిచేది వైఎస్సార్‌సీపీనే’ అని కొడాలి అన్నారు. గడిచిన మూడేళ్లలో చంద్రబాబు చేసిందేమీలేదని, ఎమ్మెల్యేగా, మంత్రిగా గతంలో నంద్యాలను అభివృద్ధి చేసింది శిల్పా మోహన్‌రెడ్డేనని కొడాలి నాని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement