హాలీవుడ్ నటి క్రిస్టెన్ స్టెవార్ట్ సంచలనం సృష్టించింది. ఓ పెర్ఫ్యూమ్ ప్రకటన కోసం అర్ధనగ్నంగా ఫొటోలకు పోజులిచ్చింది. 23 ఏళ్ల ఈ నటీమణి రంగురంగుల పెర్ఫ్యూమ్ బాటిల్ పట్టుకుని టాప్లెస్గా నలుపు తెలుపు ఫొటో తీయించుకుని ఫోజు ఇచ్చింది. ఫ్రెంచి కంపెనీ బాలెన్సిగా రూపొందించిన రోసాబొటానికా అనే బ్రాండు కోసం ఆమె ఈ ఫొటో తీయించుకుంది.
ఈ చిత్రాన్ని మిర్రర్.కో.యుకె వెబ్సైట్ ప్రచురించింది. ఈ ఫొటోలో రంగుల్లో కనిపించేది కేవలం పెర్ఫ్యూమ్ బాటిల్ మాత్రమే. మిగిలినదంతా నలుపు తెలుపుల్లోనే ఉంటుంది. దాంతోపాటు క్రిస్టెన్ భుజాల మీద నుంచి ఓ పూలదండ కూడా వేలాడుతూ కనిపిస్తుంది. ఈ ప్రకటన ప్రస్తుతం హాలీవుడ్ ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోంది.
పెర్ఫ్యూమ్ ప్రకటన కోసం అర్ధనగ్న పోజు
Published Thu, Jan 9 2014 11:01 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM
Advertisement
Advertisement