
'ముఖ్యమంత్రి పదవికి మచ్చ తెచ్చిన మమత'
శారదా చిట్ఫండ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై సీపీఎం విమర్శులు గుప్పించింది.
కోల్కతా: శారదా చిట్ఫండ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై సీపీఎం విమర్శులు గుప్పించింది. ముఖ్యమంత్రి స్థానానికి మచ్చ తెచ్చారని దీదీపై మండిపడింది. పేదల సొమ్ముతో ముడిపడిన అంశంలో ఇంతకుముందెప్పుడూ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రిపై అవినీతి ఆరోపణలు రాలేదని సీపీఎం పేర్కొంది.
మమత కారణంగా ముఖ్యమంత్రి పదవి ప్రతిష్ట మంటగలిసిందని సీసీఎం రాష్ట్ర కార్యదర్శి సుజన్ చక్రవర్తి వ్యాఖ్యానించారు. శారదా కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కునాల్ ఘోష్ అరెస్టైన కావడంతో మమత పాత్రపై అనుమానాలు తలెత్తున్నాయని చెప్పారు.