న్యూఢిల్లీ: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గురువారం సాయంత్రం విడుదలయ్యాయి. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కమలం పార్టీకే పట్టం కట్టాయి. అయితే ఇండియాటుడే- యాక్సిస్ మాత్రం కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకుంటుందని అంచనా వేసింది.
15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంచుకోట్ బద్దలు కావడం ఖాయమని అంచనా వేశాయి. 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్ లో మెజారిటీ సీట్లు బీజేపీ దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఎన్నికల పోలింగ్ కౌటింగ్ ఈనెల 11న జరగనుంది.
సీఎం ఇబోబీసింగ్ నాయకత్వంలో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ఈసారి ఎదురుగాలి తప్పదని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తేల్చాయి. 2002లో కాంగ్రెస్ 20 సీట్లు గెలుచుకుంది. 2007, 2012లో 42 సీట్లతో ఘన విజయం సాధించింది. 2002 ఎన్నికల్లో బీజేపీకి కేవలం 10 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2007, 2012 ఎన్నికల్లో కషాయదళం ఒక్కసీటూ గెలవలేదు. ఇరోమ్ షర్మిల స్థాపించిన పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయెన్స్ పార్టీ ప్రభావం చూపలేకపోయింది.
చానల్ | బీజేపీ | కాంగ్రెస్ | ఇతరులు |
ఇండియా టీవీ- సీఓటర్ | 25-31 | 17-23 | 09-15 |
ఇండియా టుడే-యాక్సిస్ | 16-22 | 30-36 | 06-11 |
టైమ్స్- వీఎమ్మార్ | 20 | 20 | 12 |