Manipur Elections
-
మణిపూర్‌లో కొనసాగుతున్న రెండో విడత పోలింగ్
-
స్టెప్పులేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
-
నేరస్థులు నలుగురు.. కోటీశ్వరులు 32 మంది
ఇంఫాల్: నేర చరిత్ర లేని ప్రజాప్రతినిధులను ఆశిస్తుంటే.. రోజురోజుకి వీరి సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. తాజాగా మణిపూర్ శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 32 మంది కోటీశ్వరులు, నలుగురు నేరస్థులు ఉన్నారని ఏడీఆర్ (అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిపోర్మ్స్) తెలిపింది. నేరచరిత్ర, ఆస్తులు, విద్య, వయసు వివరాలపై విశ్లేషించి మంగళవారం ఒక రిపోర్ట్‌ను విడుదల చేసింది. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 28 , బీజేపీ 21, ఇతరులు 11 స్థానాలు గెలుచుకున్నారు. కొత్తగా గెలుపొందిన ఎమ్మెల్యేల్లో క్రిమినల్ కేసులున్నవారు ఇద్దరని, సీరియస్ క్రిమినల్ కేసులు (హత్యానేర ఆరోపణలు) మరో ఇద్దరిపై ఉన్నాయని పేర్కొంది. బీజేపీలో ఇద్దరు ఎమ్మెల్యేలపై, కాంగ్రెస్ నేతల్లో ఇద్దరిపై క్రిమినల్ కేసులున్నాయి. 2012 ఎన్నికల్లో గెలుపొందిన వారిలో ఏ ఒక్కరికి నేరచరిత్ర లేదు. గత ఎన్నికల్లో సగటు ఎమ్మెల్యే ఆస్తి రూ.95.551లక్షలు కాగా 2017 లో రూ.2.196 కోట్లకు చేరింది. గత ఎన్నికల్లో కోటీశ్వరులు 27 శాతం ఉండగా ఈ ఎన్నికల్లో 53 శాతం మంది ఉన్నారు. ఆస్తుల వివరాల్లో మొత్తం 60 మంది ఎమ్మెల్యేల్లో రూ.5 కోట్ల కన్నా ఎక్కవ ఆస్తులన్న అభ్యర్థులు ఇద్దరు, రూ.2- 5 కోట్ల ఆస్తులు ఉన్నవారు 17 మంది, రూ. 50 లక్షల - రూ.2కోట్లు ఉన్న వారు 27 మంది ఉన్నట్లు ఎమ్మెల్యేలు తమ ఎన్నికల అఫిడవిట్లో తెలిపారని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఇక 13 మందికి రూ.10 - 50 లక్షల ఆస్తులు మాత్రమే ఉన్నాయి. అత్యధిక ఆస్తులున్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందినవారే ఉన్నారు. 28 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 18 మంది కోటీశ్వరులు, బీజేపీలో 21 ఎమ్మెల్యేలలో 10 మంది ఉన్నారు. ఇతరుల్లో నలుగురు ఎమ్మెల్యేలు కోటీశ్వరులు. అత్యధికంగా రూ.36 కోట్ల ఆస్తి ఉన్నట్లు కాంగ్రెస్ ఉక్రుల్ ఎమ్మెల్యే ఎస్. అర్థుర్ ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. ఇక అతి తక్కువగా రూ. 9.28లక్షల ఆస్తి ఉన్నట్లు బీజేపీ ఇంఫాల్ వెస్ట్ ఎమ్మెల్యే సెక్మాల్ ప్రకటించారు. ఆదాయపు పన్ను దాఖలు చేసిన అభ్యర్థులు ముగ్గురు. వీరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడం విశేషం. 60 మంది ఎమ్మెల్యేల్లో 18 మంది ఆదాయపుపన్ను వివరాలు వెల్లడించారు. 2017 ఎన్నికల్లో 28 మంది అభ్యర్థులు రెండోసారి ఎన్నికయ్యారు. 2012లో వీరి సగటు ఆస్తి రూ.1.39 కోట్లు ఉండగా 2017లో రూ.1.96 కోట్లకు చేరింది. వీరి ఆస్తులు 41 శాతం పెరిగాయి. కాంగ్రెస్ నుంచి 22 మంది రెండో సారి ఎన్నిక కాగా, బీజేపీ నుంచి నలుగురు, ఇతరపార్టీల నుంచి ఇద్దరు గెలుపొందారు. విద్యార్హతల పరంగా 14 మంది 5 నుంచి 12వ తరగతి చదివిన వారు ఉండగా, 42 మంది ఎమ్మెల్యేలు డిగ్రీ పూర్తిచేశారు. వీరిలో 13 మంది పీజీ చదివారు. ఒక ఎమ్మెల్యే నిరక్షరాస్యుడని తెలిపారు. వయసు రీత్యా 27 మంది ఎమ్మెల్యేలు 50 ఏళ్ల లోపు, 33 మంది 50 ఏళ్ల పై బడిన వారున్నారు. 8 మంది యువకులు ఎమ్మెల్యేలుగా ఎంపికయ్యారు. మహిళా ఎమ్మెల్యేలు మాత్రం ముగ్గురే. 2012 లో ఇద్దరు మహిళలు మాత్రమే గెలిచారు. ఈ సారి అదనంగా ఒక మహిళా ఎమ్మెల్యే శాసనసభలో అడుగు పెట్టనున్నారు. -
మణిపూర్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు
న్యూఢిల్లీ: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గురువారం సాయంత్రం విడుదలయ్యాయి. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కమలం పార్టీకే పట్టం కట్టాయి. అయితే ఇండియాటుడే- యాక్సిస్ మాత్రం కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకుంటుందని అంచనా వేసింది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంచుకోట్ బద్దలు కావడం ఖాయమని అంచనా వేశాయి. 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్ లో మెజారిటీ సీట్లు బీజేపీ దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఎన్నికల పోలింగ్ కౌటింగ్ ఈనెల 11న జరగనుంది. సీఎం ఇబోబీసింగ్ నాయకత్వంలో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ఈసారి ఎదురుగాలి తప్పదని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తేల్చాయి. 2002లో కాంగ్రెస్ 20 సీట్లు గెలుచుకుంది. 2007, 2012లో 42 సీట్లతో ఘన విజయం సాధించింది. 2002 ఎన్నికల్లో బీజేపీకి కేవలం 10 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2007, 2012 ఎన్నికల్లో కషాయదళం ఒక్కసీటూ గెలవలేదు. ఇరోమ్ షర్మిల స్థాపించిన పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయెన్స్ పార్టీ ప్రభావం చూపలేకపోయింది. చానల్ బీజేపీ కాంగ్రెస్ ఇతరులు ఇండియా టీవీ- సీఓటర్ 25-31 17-23 09-15 ఇండియా టుడే-యాక్సిస్ 16-22 30-36 06-11 టైమ్స్- వీఎమ్మార్ 20 20 12 -
రాహుల్ గాంధీ.. ఓ కొబ్బరికాయ!
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రసంగాల మీద పదే పదే జోకులు పేలుతున్నాయి. తాజాగా ఆయన చేసిన మరో ప్రసంగం కూడా సోషల్ మీడియాలో జోకులకు కారణమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన 'మేకిన్ ఇండియా' నినాదాన్ని అంది పుచ్చుకోవాలనుకున్నారో ఏమో గానీ.. అచ్చం ఆయన మాట్లాడినట్లే మాట్లాడేందుకు రాహుల్ ప్రయత్నించి, బొక్కబోర్లా పడ్డారు. మణిపూర్ ఎన్నికల ప్రచారం కోసం ఆయన అక్కడకు వెళ్లారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో పైనాపిల్, వక్క, తమలపాకులు ఇలాంటివి చాలా విస్తృతంగా పండుతాయి. అందువల్ల అక్కడ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుచేయాలన్నది రాహుల్ డిమాండు. ఆ విషయం చెప్పడానికి ఆయన చెప్పిన మాటలే చిత్రంగా ఉన్నాయి. ''లండన్‌లో ఎవరో ఒకరు కొబ్బరి రసం తాగుతూ ఉండాలి.. ఆ బాటిల్ మీద మేడిన్ మణిపూర్ అని రాసి ఉండాలన్నది నా ఆశ'' అని రాహుల్ అన్నారు. ప్రధాని మోదీ అచ్చం ఇలాగే మాట్లాడుతుంటారు. కానీ, విషయం ఏమిటంటే.. మణిపూర్ వాతావరణానికి అక్కడ అసలు కొబ్బరిచెట్లే పెరగవు, కొబ్బరికాయలు కాయవు. ఆ సంగతి తెలుసుకోకుండా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొబ్బరి నీళ్ల గురించి మాట్లాడటంతో ట్విట్టర్ జనాలు ఆయన మీద జోకులు పేల్చారు. బహుశా మణిపూర్ సీఎం ఓక్రమ్ ఇబోబి సింగ్ ఆయనకు స్పీచ్ రాసిచ్చేటపుడు మర్చిపోయారేమోనని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎద్దేవా చేశారు. -
ఉక్కు మహిళ వినూత్న ఎత్తుగడ
ఇంఫాల్: ప్రత్యేక భద్రతా దళాలకు ఉన్నప్రత్యేక హక్కులకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పోరాటం చేసిన ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల చాను ప్రస్తుత ఎన్నికల్లో కూడా తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు.16ఏళ్ల పోరాటానికి గత ఏడాది స్వస్తి పలికి రాజకీయనేతగా అవతరించి మణిపూర్ ఎన్నికల్లో పోటీచేస్తున్న షర్మిల సరికొత్త తీరుతో వ్యవహరిస్తున్నారు. పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయన్స్ (పీఆర్ జేయే) పార్టీతో ఎన్నికల బరిలో దిగిన ఇరోం ముఖ్యమంత్రి ఓకరం ఇబోబి సింగ్ ఢీకొంటున్నారు. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నికల నేపథ్యంలో ఆన్ లైన్ లోవిరాళాలు సేకరించాలని (క్రౌడ్ ఫండింగ్) చేయాలని ఆమె నిర్ణయించారు. మార్పు కోసం రూ.10ఇవ్వాలంటూ ఆమె ప్రజల్ని కోరుతున్నారు. ప్రజల నుంచి రూ.10 వసూలు చేయటం ద్వారా జనాలకు మరింత దగ్గర రావటంతోపాటు.. ఎన్నికల్లో మరింత పారదర్శకత తీసుకు రావటానికి సాయం చేస్తుందని ఆమె చెబుతున్నారు. అంతేకాదు ఇప్పటికే దాకారూ. 4.5 లక్షల సేకరించారు. ఎన్నికల కోసం ప్రజల నుంచి రూ.10 చొప్పున విరాళాలు వసూలు చేస్తున్నఏకైక ప్రాంతీయ రాజకీయ పార్టీ షర్మిలదనే చెబుతున్నారు. ప్రజలకు దగ్గరగా ఉండటానికి.. వారి కష్టాల్ని తెలుసుకోవటానికి వీలుగా సైకిల్ మీదనే వెళ్లాలని భావిస్తున్నఆమె..తన పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులందరిని సైకిల్ మీదనే ప్రచారం చేయాలని కోరటం గమనార్హం. మరి.. షర్మిల అడిగినట్లుగా రూ.10 విరాళాల ప్రోగ్రాం ఏమేరకు సక్సెస్ అవుతుందో వేచిచూడాలి. -
ఈశాన్య రాష్ట్రంలో విజయం ఎవరిది?
అసోం పీఠాన్ని ఇప్పటికే బీజేపీ దక్కించుకుంది. త్వరలో జరగబోయే మణిపూర్ ఎన్నికల్లోనూ ఆ పార్టీయే గెలుస్తుందని ఇండియాటుడే - యాక్సిస్ పోల్ సర్వే చెబుతోంది. ఇప్పటికిప్పుడే ఎన్నికలు నిర్వహిస్తే.. ఆ రాష్ట్రంలో 31-35 సీట్లు గెలుచుకుని అధికారం చేపడుతుందని తెలిపింది. 60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 50 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ సర్వే అంచనాలు నిజమైతే అది కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. మరో ఆరు నెలల్లో మణిపూర్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. దాంతో మణిపూర్ అసెంబ్లీలో ఉండాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 60కి బదులు ఇప్పుడు 53 అయ్యింది. కాంగ్రెస్ నుంచి ముగ్గురు, నాగా పీపుల్స్ ఫ్రంట్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. రాబోయే ఎన్నికల్లో మణిపూర్ కాంగ్రెస్ పార్టీకి మహా అయితే 19-24 స్థానాల కంటే ఎక్కువ రావని సర్వే తేల్చేసింది. బీజేపీకి 40 శాతం ఓట్లు వస్తే.. కాంగ్రెస్‌కు 37 శాతం వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ ముక్త భారతదేశం రావాలన్న బీజేపీ నినాదాన్ని రాష్ట్రంలో 37 శాతం మంది ఆమోదిస్తున్నారు. ఇన్నర్‌లైన్ పర్మిట్ అంశం ఇప్పటికీ అక్కడ ఎన్నికలో ప్రధానాంశంగా మారింది. 62 శాతం మంది ఓటర్లు అదే ముఖ్యాంశమని చెప్పారు. రెండో ప్రధానాంశం మౌలిక సదుపాయాలు, తర్వాత ఉపాధి అవకాశాలు. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని తీసేయాలన్న అంశానికి కేవలం 6 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. ఒకప్పుడు ఐరన్ లేడీ ఆఫ్ మణిపూర్ అని ప్రసిద్ధి చెందిన ఇరోమ్ షర్మిలా చాను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పేవాళ్లు కేవలం 1 శాతమే ఉన్నారు. ఆమె ఏళ్లతరబడి చేసిన నిరాహార దీక్ష అసలు ఎన్నికల అంశమే కాదని 75 శాతం మంది చెప్పారు. -
ఎన్నికల్లో ఓడిపోతే.. పెళ్లి చేసుకుంటా!
ఎన్నికల్లో పోటీ చేస్తానని, కానీ ఒకవేళ ప్రజలు తనను తిరస్కరిస్తే మాత్రం పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిపోతానని పోరాటయోధురాలు ఇరోం షర్మిలా చాను చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలలో సైనికదళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఉపసంహరించాలన్న డిమాండుతో 16 ఏళ్లుగా చేస్తున్న దీక్షను ఆమె ఇటీవలే విరమించిన విషయం తెలిసిందే. మణిపూర్‌లో వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తానని, పెళ్లి కూడా చేసుకుంటానని షర్మిల ఇంతకుముందు చెప్పారు. ప్రజలు తన కొత్త వ్యూహాన్ని పట్టించుకోకపోయినా, తనను అవమానించినా అది తన జీవితంలో కొత్త అధ్యాయానికి కారణం అవుతుందని చెమర్చిన కళ్లతో ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె హార్లిక్స్‌తో పాటు గంజి తీసుకుంటున్నారు. షర్మిలకు మంగళవారం బెయిల్ మంజూరైనప్పుడు కోర్టు పరిసరాల్లో ఆమె బోయ్ ఫ్రెండు డెస్మండ్ కోటిన్హో మాత్రం ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న తౌబల్ నియోజకవర్గంలోనే తాను 2017 ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఇరోం షర్మిల చెప్పారు. అయితే, సాయుధదళాల ప్రత్యేకాధికారాల చట్టంపై పోరాటాన్ని ఆపేయడానికే ఆమెను రాజకీయాల్లోకి దించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఇంతకుముందు సేవ్ షర్మిల అనే ప్రచారాన్ని చేపట్టిన కొంతమంది అంటున్నారు.