కేజ్రీవాల్కు మన్మోహన్ సింగ్ అభినందనలు | Manmohan singh calls up Arvind Kejriwal to wish him | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్కు మన్మోహన్ సింగ్ అభినందనలు

Published Sat, Dec 28 2013 5:53 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

కేజ్రీవాల్కు మన్మోహన్ సింగ్ అభినందనలు - Sakshi

కేజ్రీవాల్కు మన్మోహన్ సింగ్ అభినందనలు

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఏడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఫోన్లో కేజ్రీవాల్కు అభినందనలు తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని అధిరోహించబోతున్న కేజ్రీవాల్తో ప్రధాని మన్మోహన్ సింగ్, ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపునా తమ మద్దతు ఉంటుందని ప్రధాని మన్మోహన్ హమీ ఇచ్చినట్టు తెలిసింది.

ఢిల్లీ ముఖ్యమంత్రిగా నూతన బాధ్యతలు తీసుకోనున్న సందర్భంగా మన్మోహన్, కేజ్రీవాల్కు శుభాకాంక్షలతోపాటు, తమ మద్దతును తెలిపినట్టు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. అవినీతి ప్రక్షాళనే లక్ష్యంగా రాజకీయ రంగంపైకి దూసుకొచ్చిన 45ఏళ్ల అరవింద్ కేజ్రీవాల్ ఇండియన్ రివెన్యూ సర్వీసెల్ లో ఉద్యోగాన్ని వదిలి ఆమ్ ఆద్మీ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement