
లౌకిక వాదానికి కొత్త భాష్యం చెబుతున్నారు
న్యూఢిల్లీ: భారతదేశ లౌకికవాదానికి కొత్త భాష్యం చెబుతూ లౌకిక విధానానికి గండికొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన ప్రధాని మన్మోహన్ సింగ్ మండిపడ్డారు. దేశంలో ముప్పుగా పరిణమిస్తున్న విచ్ఛిన్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సూచించారు. సోమవారం నాడిక్కడ జరిగిన వివిధ రాష్ట్రాల మైనార్టీ కమిషన్‌ల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇప్పటికే బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీతో మాటల యుద్ధం తారస్థాయికి చేరిన తరుణంలో మన్మోహన్ సింగ్ మరోసారి ఆయనపై పరోక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
ఇదిలా ఉండగా గతంలో మైనార్టీల రిజర్వేషన్లపై రంగనాథ్ మిశ్రా కమీషన్ సూచించిన సిఫార్సులను కేంద్ర పరిశీలిస్తుందని మైనార్టీ వ్యవహారాల శాఖా మాత్యులు రెహ్మాన్ తెలిపారు.