నకరికల్లు (గుంటూరు): మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల వయసున్న పాప ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో అదృశ్యం అయింది. ఈ ఘటన గుంటూరు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో జరిగింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో జూపల్లి మరియమ్మకు మేల్కువ రాగా, చూసేసరికి కుమార్తె ప్రసన్నకుమారి కన్పించలేదు.
దీంతో రాంబాబు, మరియమ్మ దంపతులు సోమవారం ఉదయం చుట్టుపక్కల, తెలిసిన వారు, బంధువుల దగ్గర విచారించారు. ఫలితం లేకపోవడంతో ఎవరో ఎత్తుకుపోయి ఉంటారని భావించి సోమవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిద్రిస్తున్న చిన్నారి అర్ధరాత్రి అదృశ్యం
Published Mon, Aug 17 2015 6:06 PM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM
Advertisement
Advertisement