
చింతా సాయి
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): రైలులో ప్రయాణిస్తున్న బాలిక అదృశ్యమైనట్లు విశాఖపట్నం గవర్నమెంట్ పోలీసులకు ఫిర్యాదు అందింది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లా, తెర్లాం మండలం, లోచర్ల గ్రామ నివాసి చింతా మురళి కుమార్తె చింతా సాయి(16) నూజివీడు ఐఐఐటీలో ప్రథమ సంవత్సరం చదువుతుంది. మంగళవారం కాలేజీ యాజమాన్యం ఫోన్ చేసి అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదని(పచ్చకామెర్లని) వెంటనే వచ్చి తీసుకెళ్లాలని సమాచారం అందించారు. దీంతో పాపను తీసుకొచ్చేందుకు మురళి నూజివీడు వెళ్లి మంగళవారం మధ్యాహ్నం కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో కుమార్తెతో కలిసి తిరుగు ప్రయాణమయ్యారు. రైలు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో విశాఖ చేరుకుంది. ఆ సమయంలో సాయి టాయ్‌లెట్‌కు వెళ్లింది. కాసేపటికి రైలు బయల్దేరింది. అయినప్పటికీ పాప ఎంతకీ రాకపోవడంతో విజయనగరంలో దిగి, మళ్లీ వెనక్కు వచ్చిన మురళి విశాఖ రైల్వేస్టేషన్‌లో గల జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు సీఐ ఆదేశాలతో ఎస్‌ఐ బాలకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment