బిస్కట్ల కోసం కుక్కల్లా.. ఆ నేతలు: కేటీఆర్ | minister ktr slams telangana tdp leaders over criticism on budget | Sakshi
Sakshi News home page

బిస్కట్ల కోసం కుక్కల్లా.. ఆ నేతలు: కేటీఆర్

Published Thu, Nov 6 2014 3:42 PM | Last Updated on Wed, Aug 15 2018 7:56 PM

బిస్కట్ల కోసం కుక్కల్లా.. ఆ నేతలు: కేటీఆర్ - Sakshi

బిస్కట్ల కోసం కుక్కల్లా.. ఆ నేతలు: కేటీఆర్

టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశలు నెరవేర్చే విధంగా ఉందన్నారు. గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన మైనార్టీలకు వేయి కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత టీఆర్ఎస్దేనన్నారు. రాబోయే రోజుల్లో ఇంటింటికి తాగునీరు అందిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.

టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి సిగ్గులేకపోవచ్చన్నారు. తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఎంగిలి మెతుకులు తినే అలవాటుందని మంత్రి కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ను అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. ఈటెల వద్దకు ఎవరైనా వెళ్తే వీపు చింతపండు చేసి పంపిద్దామని మంత్రి పద్మారావు అన్నారని కేటీఆర్ తెలిపారు. ప్రతిపక్షాల కాకిగోలను తాము పట్టించుకోమని చెప్పారు. బిస్కెట్ల కోసం కుక్కల్లా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. కరెంట్ కోతలు, రైతుల ఇబ్బందులు వాస్తవమేనని ఆయన అన్నారు. వీటికి కాంగ్రెస్, టీడీపీలే కారణమని ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement