
పొంగిన మూల వాగు
కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలంలోని మూలవాగు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పొంగిపొర్లింది.
కోనరావుపేట(కరీంనగర్ జిల్లా): కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలంలోని మూలవాగు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పొంగిపొర్లింది. బుధవారం నుంచి వాగు పొంగి పొర్లడంతో మండలంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మండలంలోని కనగర్తి గ్రామంలో పత్తి పంట నీట మునిగింది.
కాగా, ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయినా అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్నే విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా బ్రేక్‌డౌన్ కావడంతోనే విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని.. పునరుద్ధరిస్తామని వారు తెలిపారు.