
రేప్ కేసులో నెల్సన్ మండేలా మనవడి అరెస్టు
జాతి దురహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు నెల్సన్ మండేలా. కానీ ఆయన మనవడు మాత్రం 15 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేసిన కేసులో అరెస్టయ్యాడు. ఈ విషయాన్ని దక్షణాఫ్రికా పోలీసులు తెలిపారు. ఎంబుసో మండేలా (24) ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు. అతడు పెట్టుకున్న బెయిల్ దరఖాస్తుపై శుక్రవారం నాడు జొహాన్నెస్బర్గ్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరుగుతుంది. జొహాన్నెస్బర్గ్ శివారల్లలోని గ్రీన్సైడ్ రెస్టారెంటులో 15 ఏళ్ల అమ్మాయిపై ఆగస్టు 7వ తేదీన ఎంబుసో అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది.
ఘటన జరిగిన వారం రోజుల తర్వాత ఫిర్యాదు అందగా.. గత శనివారం నాడు ఎంబుసో మండేలాను పోలీసులు అరెస్టు చేశారు. నెల్సన్ మండేలాకు మొత్తం 17 మంది మనవలుండగా, వాళ్లలో ఒకడే ఈ ఎంబుసో. నెల్సన్ మండేలా 95 ఏళ్ల వయసులో 2013 సంవత్సరంలో మరణించిన విషయం తెలిసిందే.