సింధు అయినా మన ఆశల్ని నిలబెట్టాలి!
రియో ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు అదృష్టం అన్నది ఒక్కసారి కూడా భారత్ వైపు నిలబడలేదు. మొదట షూటర్ అభినవ్ బింద్రా త్రుటిలో పతకం చేజార్చుకొని నాలుగోస్థానానికి పరిమితమయ్యాడు. ఆ తర్వాత సానియా-బోపన్న జోడీ కూడా సెమీస్‌కు వెళ్లినా పతకం తేలేకపోయారు. ఎన్నో ఆశలు రేకెత్తించిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కూడా ఫైనల్ అద్భుత విన్యాసాలు చేసినా పతకం సాధించకుండా నిరాశగా వెనుదిరిగింది. నాలుగో స్థానానికి పరిమితమైంది.
భారత షూటర్లు, బాక్సర్లు, అథ్లెట్లు రియో ఒలింపిక్స్‌లో తమ పోరాటం ముగించుకొని ఉత్త చేతులతో ఇంటిదారి పట్టారు. ఈ నేపథ్యంలో షటర్లపై దేశ ప్రజలు భారీ ఆశలే పెట్టుకున్నారు. వారి ఆశల్ని, ఆకాంక్షల్ని నిలబెడుతూ అద్భుతమైన పోరాటస్ఫూర్తి కనబర్చిన సింధు బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీస్‌లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్ లో ప్రపంచ నంబర్-2, చైనా క్రీడాకారిణి యిహాన్ వాంగ్‌పై 22-20, 21-19 తేడాతో గెలుపొంది సెమీస్‌లోకి అడుగుపెట్టింది. చైనా గోడను విజయవంతంగా దాటిన సింధుకు ట్విట్టర్‌లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సెమీస్‌లోకి చేరిన సింధు అయిన పతకం సాధించాలని నెటిజన్లు ఆకాంక్షించారు. ఆమె విజయం కోసం ప్రార్థించారు. సెలబ్రిటీలు, క్రీడాకారులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు సింధు విజయం హర్షం వ్యక్తం చేశారు. సింధు నిజమైన చాంపియన్ అంటూ కొనియాడుతూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.
Very well played Sindhu...God bless for your next match too
— Randhir Singh (@RANDHIR1946) August 16, 2016
@Pvsindhu1 congratulations to u for reaching the semi finals