సివిల్స్ మెయిన్స్కు 15 వేల మంది అర్హత.. | Over 15,000 qualify in civil services prelims exam: UPSC | Sakshi
Sakshi News home page

సివిల్స్ మెయిన్స్కు 15 వేల మంది అర్హత..

Published Tue, Oct 13 2015 9:05 AM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM

సివిల్స్ మెయిన్స్కు 15 వేల మంది అర్హత.. - Sakshi

సివిల్స్ మెయిన్స్కు 15 వేల మంది అర్హత..

దేశ అత్యున్నత ఉద్యోగాలైన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఈ ఏడాది 15 వేల మందికిపైగా అభ్యర్థులు అర్హత సాధించారు.

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత ఉద్యోగాలైన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఈ ఏడాది 15 వేల మందికిపైగా అభ్యర్థులు అర్హత సాధించారు. గత ఆగస్టులో నిర్వహించిన పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. 'మొత్తం 15,008 మంది అభ్యర్థులు తర్వాతి దశకు అర్హత సాధించారు' అని యూపీఎస్సీ(యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) సెక్రటరీ అషిమ్ ఖురానా చెప్పారు.

సివిల్స్ ప్రిలిమ్స్- 2015 పరీక్షలకు రికార్డు స్థాయిలో 9,45,908 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 4.63 లక్షల మంది పరీక్ష రాశారు. పరీక్ష పూర్తయిన 50 రోజుల్లోనే ఫలితాలు వెలువడటం గమనార్హం. ఇంత తక్కువ వ్యవధిలో ఫలితాలు విడుదల చేయడం ఇదే మొదటిసారని ఖురానా పేర్కొన్నారు.

ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులు.. డిసెంబర్ 18, 2015న మెయిన్స్ పరీక్షల కోసం సంపూర్ణ వివరాలతో కూడిన దరఖాస్తును ఆన్ లైన్ లో పూరించాల్సి ఉంటుందని చెప్పారు. మరింత సమాచారం కోసం http://www.upsc.gov.in చూడటం లేదా 011-23385271, 011-23098543, 011-23381125 నంబర్లకు ఫోన్ చేయవచ్చని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement