సీక్రెట్ లాకర్లో భారీగా కొత్త కరెన్సీ
సీక్రెట్ లాకర్లో భారీగా కొత్త కరెన్సీ
Published Tue, Dec 13 2016 1:41 PM | Last Updated on Wed, Oct 17 2018 4:10 PM
దేశవ్యాప్తంగా ఐటీ, సీబీఐ, సీఐడీ నిర్వహిస్తున్న దాడుల్లో కోట్లకు కోట్ల కొత్త కరెన్సీ వెలుగులోకి వస్తోంది. తాజాగా అసోం సీఐడీ పోలీసులు కోటిన్నరకు పైగా కొత్త కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. హర్జీత్ సింగ్ భేడి అనే వ్యాపారవేత్త ఇంట్లో చేసిన రైడ్స్లో కొత్త రూ.2000, రూ.500 కరెన్సీ పట్టుబడినట్టు మంగళవారం సీఐడీ అధికారులు పేర్కొన్నారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. పెద్ద మొత్తంలో బ్లాక్ మనీ బేడీ నివాసంలో దాచిన్నట్టు తెలుసుకున్న తాము, బెల్టోలా ప్రాంతంలో గల ఆయన ఇంట్లో దాడులు నిర్వహించామని చెప్పారు. ఈ దాడుల్లో రూ.1,54,61,000ను బయటపడిందన్నారు. బెడ్రూంలోని సీక్రెట్ లాకర్లో ఈ మొత్తాన్ని ఆయన దాచి ఉంచారని అధికారులు వెల్లడించారు.
ఈ విషయాన్ని తాము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు అందించామని, వారు బేడీ అక్రమాస్తులపై విచారణ సాగిస్తున్నారని చెప్పారు. కొత్త కరెన్సీ నోట్లు దొరకక సాధారణ ప్రజానీకం బ్యాంకుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతుంటే, ఇంత పెద్ద మొత్తంలో వారికి ఎలా నగదు దొరికిందనే విషయంపై కూడా వారు విచారణ కొనసాగిస్తున్నారు. ఒకవేళ ఐటీ డిపార్ట్మెంట్ విచారణలో ఈ సొమ్ము అక్రమమని తేలితే వెంటనే సీఐడీ కేసు నమోదుచేయనుంది. అదేవిధంగా డిపార్ట్మెంట్లో 18 మంది అధికారులతో క్విక్ రెస్పాన్స్ టీమ్(క్యూఆర్సీ)ను ఏర్పాటుచేయనున్నట్టు సీఐడీ ప్రకటించింది. ఈ టీమ్ బ్లాక్మనీకి, ఇతర అక్రమ కేసులకు వ్యతిరేకంగా పోరాడనుంది. 18 మంది అధికారులు మూడు టీమ్స్గా ఏర్పడి, స్థానిక పోలీసుల సాయంతో రాష్ట్రవ్యాప్తంగా తమ కార్యకలాపాలు సాగించనున్నారు.
Advertisement
Advertisement