నాగలాపురం(చిత్తూరు): చిత్తూరు జిల్లా నాగలాపురం పంచాయుతీరాజ్ ఏఈ ఈశ్వర్‌బాబు బుధవారం సాయుంత్రం రూ.25 వేలు లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ శంకర్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగలాపురం మండలం అచ్చమనాయుడు కండ్రిగలో హర్షవర్దన్‌ప్రసాద్ రూ.3.60 లక్షల విలువ చేసే చెక్‌డ్యాం పనులు చేశాడు. ఇందుకు సంబంధించి రూ.2.2 లక్షల బిల్లు పొందాడు. మిగిలిన బిల్లును రెండో విడతగా పొందాల్సి ఉంది. అయితే పంచాయతీరాజ్ ఏఈ ఈశ్వరబాబు రూ.30 వేలు డివూండ్ చేయగా హర్షవర్ధన్‌ప్రసాద్ రూ.25 వేలకు బేరం కుదుర్చుకున్నాడు.
అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తిరుపతి ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి, సీఐలు చంద్రశేఖర్, సుధాకర్‌రెడ్డి, లక్ష్మీకాంతన్ బుధవారం సాయంత్రం దాడులు చేశారు. ఎంపీడీవో కార్యాలయంలోని ఏఈ గదిలో ఉన్న నగదును స్వాధీనం చేసుకుని కెమికల్ టెస్టులు, వేలిముద్రలను సేకరించారు. ఎంపీడీవో సురేంద్రనాథ్‌తోపాటు సిబ్బందిని విచారించారు. పట్టబడ్డ ఏఈ ఈశ్వర్‌బాబును నెల్లూరు న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఏఈ
Published Wed, Sep 9 2015 11:15 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement