ఆ సిఫార్సులను ఇందిరా గాంధీ తొక్కేశారు!
ఆ సిఫార్సులను ఇందిరా గాంధీ తొక్కేశారు!
Published Fri, Dec 16 2016 12:34 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుపై విపక్షాలు చేస్తున్న రాద్ధాంతంపై ప్రధాని మోదీ బిగ్ కౌంటర్ ఇచ్చారు. అవినీతిని నిర్మూలించడానికి పెద్ద నోట్లను రద్దు చేయాలని వాంచో కమిటీ 1971లోనే ఇందిరాగాంధీకి సిఫార్సు చేశారని పేర్కొన్నారు. కానీ ఆ రిపోర్టును ఇందిరాగాంధీనే తొక్కేశారని ఆయన విమర్శించారు. పెద్ద నోట్ల వెనుకున్న ప్రధాని మోదీ అవినీతి చిట్టా తన దగ్గరుందని, అందుకే పార్లమెంటులో తనని మాట్లాడివ్వడం లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. దాన్ని బిగ్ జోక్గా బీజేపీ నేతలు కొట్టిపారేశారు. బ్లాక్మనీ నిర్మూలనకు ప్రభుత్వం నిర్దేశించుకుని లక్ష్యాన్ని ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని మండిపడ్డారు. బీజేపీ ఎంపీలచే పార్టీ పార్లమెంటరీ మీటింగ్లో ఆయన ఈ మేరకు ప్రసంగించారు.
అప్పట్లో 2జీ, కోల్గేట్ స్కాం వంటి అవినీతిలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై పోరాడేవని, కానీ ఇప్పుడు నల్లధనంపై ప్రభుత్వం చేస్తున్న పోరాటాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించడం చాలా విడ్డురంగా ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు దేశం కంటే పార్టీనే ముఖ్యమని, కానీ బీజేపీకి దేశమే సుప్రీం అని చట్టసభ్యులకు తెలిపారు. డిజిటల్ ఎకానమీ ఒక జీవన విధానంగా ఉండాలని, అప్పుడే ఆర్థికవ్యవస్థలో పారదర్శకత తీసుకురాగలుగుతామని చెప్పారు. డిజిటల్ లావాదేవీల వాడకంపై ప్రజల్లో ప్రోత్సాహం తేవాలని మోదీ హితబోధ చేశారు.
Advertisement
Advertisement