ఒక్క ఎస్ఎంఎస్ జీవితాన్నే మార్చేస్తుంది అనడానికి తాజాగా ఘటనే ఉదాహరణ.
చెన్నై: ఒక్క ఎస్ఎంఎస్ జీవితాన్నే మార్చేస్తుంది అనడానికి తాజాగా ఘటనే ఉదాహరణ. ఓ మైనర్ బాలికకు ఇష్టం లేని పెళ్లి చేయదలచిన తల్లి దండ్రులకు ఒక ఎస్ఎంఎస్ ద్వారా షాకిచ్చిందో యువతి. చెన్నైలోని సుర్ బుర్బాన్ ప్రాంతంలో 17 సంవత్సరాల యువతికి ఆమె తల్లి దండ్రులు జూన్ 8వ తేదీన పెళ్లి చేయాలని నిశ్చయించారు. తనకు అప్పుడే పెళ్లి వద్దని, ఇంకా చదువుకుంటానని చెప్పినా ఆ బాలిక తల్లి దండ్రులు ఎంతమాత్రం పట్టించుకోలేదు.
ఈ క్రమంలో ఆ యువతి పరిస్థితి చేయిదాటుతుందని గ్రహించి పోలీసులకు 'ఎస్ఎంఎస్' ద్వారా సమాచారం అందించింది. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆ మైనర్ బాలిక పెళ్లిని అడ్డుకుని.. బాలల సంక్షేమ కేంద్రానికి తరలించారు. అక్కడ ఆమె చదువుకోవడానికి ఎంతమాత్రం ఇబ్బంది ఉండదని పోలీసులు తెలిపారు.