
నాణ్యమైన విద్యకు ఐఐటీలదే బాధ్యత!
న్యూఢిల్లీ:దేశంలోని నాణ్యమైన విద్యను అందించేందుకు ఐఐటీల నడుంబిగించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్సష్టం చేశారు. దీనికి సంబంధించిన మార్గాలను ఐఐటీలు అన్వేషించాలని ఆయన తెలిపారు. ఆ రకంగా విద్యలో నాణ్యత ఉన్నప్పుడు భారతదేశం మానవ వనరల్లో విశిష్టమైన శక్తిగా అవతరిస్తుందన్నారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్ లో ఐఐటీ బోర్డు అధ్యక్షులతో సమావేశమైన ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. 'దేశంలో జ్ఞానం పెంపొందించడానికి ఐఐటీ నాయకత్వం వహించాలి.
అందుకోసం తగిన ప్రణాళికలతో ఐఐటీ నిపుణులు ముందుకెళ్లాలి. ఏ రకంగా అయితే నాణ్యమైన విద్యను అందించ గలమో.. దాని కోసం ఐఐటీలు శోధించాలి' అని ప్రణబ్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఎటువంటి ఆలస్యం చేయకుండా త్వరతిగతిన తగిన చర్యలు చేపట్టాలని ఆయన విజ్క్షప్తి చేశారు. మన శక్తి సామర్ధ్యాలు స్వదేశీ పరిజ్ఞానానికి వినియోగించి పలు శాటిలైట్ లను అంతరిక్షంలో ప్రవేశపెట్టడానికి వినియోగించాలన్నారు.