ముంబై/న్యూఢిల్లీ: అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ భారత్‌లో పెట్టుబడులకు సంబంధించి ఇక రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. భారతీ గ్రూప్‌తో జాయింట్ వెంచర్ ద్వారా వాల్‌మార్ట్ హోల్‌సేల్(క్యాష్ అండ్ క్యారీ) రిటైల్ వ్యాపారాన్ని భారత్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, వాల్‌మార్ట్ విదేశీ మారకద్రవ్య లావాదేవీల నిబంధనల(ఫెమా)ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.
దీనిపై ఇప్పటికే దర్యాప్తును పూర్తి చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) తన నివేదికను ఆర్‌బీఐకి సమర్పించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా, వాల్‌మార్ట్ పెట్టుబడుల విషయంలో నిబంధనలను ఉల్లంఘించలేదని ఈడీ క్లీన్‌చిట్ ఇచ్చింది. దీంతో ఇక ఆర్‌బీఐ ఈడీ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టి తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉందని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, భారతీతో జాయింట్ వెంచర్ నుంచి ఇటీవలే తెగతెంపులు చేసుకున్న వాల్‌మార్ట్... భారత్‌లో ఇక సొంతంగా వ్యాపారాన్ని నిర్వహిస్తామని, ఇక్కడి నిబంధనలను తాము పూర్తిగా పాటిస్తున్నామని అంటోంది.
వాల్‌మార్ట్ పెట్టుబడులపై ఇక ఆర్‌బీఐ దర్యాప్తు!
Published Sat, Oct 19 2013 1:31 AM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM
Advertisement
Advertisement