చైనీస్ సైన్స్ అకాడమీలో సీఎన్‌ఆర్ రావుకు చోటు | Prof CNR Rao first Indian in China science academy | Sakshi
Sakshi News home page

చైనీస్ సైన్స్ అకాడమీలో సీఎన్‌ఆర్ రావుకు చోటు

Published Sat, Nov 23 2013 5:02 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM

Prof CNR Rao first Indian in China science academy

బెంగళూరు: భారతరత్న, ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావుకు మరో అరుదైన గౌరవం. ప్రతిష్టాత్మకమైన చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్(సీఏఎస్)లో ఆయనకు గౌరవ విదేశీ సభ్యుడి హోదా దక్కింది. ఒక భారతీయ శాస్త్రవేత్తకు సీఏఎస్‌లో చోటు దక్కడం ఇదే తొలిసారి. సీఏఎస్‌లో నోబెల్ బహుమతి అందుకున్న పలువురు శాస్త్రవేత్తలతోపాటు ప్రపంచ  ప్రసిద్ధిగాంచిన సైంటిస్టులు సభ్యులుగా ఉన్నారు. ఈనెల 4న సర్వసభ్య సమావేశంలో సీఏఎస్ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని బెంగళూరులోని జవహర్‌లాల్ నెహ్రూ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ ఒక ప్రకటనలో తెలిపింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement