CNR Rao
-
'ప్రధానికి మంచి సలహాదారు అవసరం'
బెంగళూరు: శాస్త్ర, సాంకేతిక పరమైన అంశాలపై ఉత్తమ సలహాలు, సూచనలు అందించేందుకు ప్రధాని నరేంద్రమోదీకి మంచి సలహాదారు అవసరం ఉందని భారతరత్న అవార్డు గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావు అభిప్రాయపడ్డారు. ఓ మీడియా సంస్థకు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంతో దూరదృష్టి కలిగిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన అద్భుత ఆలోచనలతో ముందుకు సాగున్నారని చెప్పారు. అయితే పాలనా అంశాల్లో శాస్త్ర, సాంకేతికను వినియోగించుకోవడంతో పాటు దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశంపై సలహాలు అందించేందుకు ఈ రంగంలో నిపుణులైన సలహాదారు అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పేదరికం వంటి అనేక సమస్యలను శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరిష్కరించడం సాధ్యమవుతుందని అన్నారు. భారత్‌లో పరిశోధనలకు ప్రాముఖ్యత ఇవ్వడం, పరిశోధనల ఫలాలను సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా భారత్‌ను ప్రపంచ దేశాలతో పోటీపడేలా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు. -
సీఎన్ఆర్ రావుకు జపాన్ అత్యున్నత పౌర పురస్కారం
బెంగుళూరు: సైన్స్ రంగంలో చేసిన కృషికి గానూ ప్రఖ్యాత శాస్త్రవేత్త, భారతరత్నసీఎన్ఆర్ రావు(చింతామణి నాగేశ రామచంద్రరావు) జపాన్ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికయ్యారు. ఇండో-జపనీస్ సైన్స్ కోఆపరేషన్కి ఆయన చేసిన సేవలకిగానూ ఈ పురస్కారానికి ఎంపిచేశారు. సాలిడ్ స్టేట్, మెటీరియల్స్ కెమిస్ట్రీలో అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన శాస్త్రవేత్తగా సీఎన్ఆర్ రావుకు మంచి గుర్తింపు ఉంది. నాన్ మెటీరియల్స్, గ్రాఫీన్‌లపై రెండు దశాబ్దాలుగా విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. ఆయన దాదాపు 1600 పరిశోధన పత్రాలు, 50 పుస్తకాలు ప్రచురించారు. ప్రపంచవ్యాప్తంగా 70 విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. సీఎన్ఆర్ రావు 1934, జూన్ 30న బెంగళూరులో జన్మించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ చేశారు. అమెరికాలోని పర్డ్యు యూనివర్సిటీ నుంచి 1958లో పీహెచ్డీ అందుకున్నారు. ఐఐటీ కాన్పూర్‌లో రసాయనశాస్త్ర అధిపతిగా 13 ఏళ్లు పనిచేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డెరైక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనకు 2005లో నోబెల్ బహుమతితో సమానమైన పది లక్షల డాలర్ల డాన్ డేవిడ్ ప్రైజ్ లభించింది. భారతరత్నతో పాటు 2013లో సీఎన్ఆర్ రావుకు ప్రతిష్టాత్మకమైన చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్(సీఏఎస్)లో గౌరవ విదేశీ సభ్యుడి హోదా కూడా దక్కింది. -
మహోన్నతులను మనమే గుర్తించాలి
హైకోర్టు చీఫ్ జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా శివానంద ఎమినెంట్ సిటిజన్స్ అవార్డుల ప్రదానం భారతరత్న సీఎన్‌ఆర్‌రావు, డాక్టర్ సత్యవ్రత్ శాస్త్రిలకు అందజేత సాక్షి, హైదరాబాద్: మనదేశానికి చెందిన మహోన్నత వ్యక్తులను ముందు ప్రపంచం గుర్తించిన తర్వాతే మనం గుర్తిస్తున్నామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా అన్నారు. ఇది చాలా విచారించదగ్గ విషయమని పేర్కొన్నారు. సనాతనధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ‘శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డు-2014’ ప్రదానోత్సవం సికింద్రాబాద్‌లోని తివోలి గార్డెన్లో వైభవంగా జరిగింది. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కె. బసవరాజు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి చీఫ్ జస్టిస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భారతరత్న ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు, మహామహోపాధ్యాయ డాక్టర్ సత్యవ్రత్ శాస్త్రిలను శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డులతో చీఫ్ జస్టిస్ సత్కరించారు. చికాగో సభలో స్వామి వివేకానంద భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల గురించి అనర్గళంగా మాట్లాడిన తర్వాతే మనం గుర్తించామని చీఫ్ జస్టిస్ ఉదహరించారు. వివిధ రంగాల్లో ఎనలేని కృషి చేసి దేశానికి సేవలందించిన రత్నాల్లాంటి వ్యక్తులను మనమే మొదట గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.సీఎన్ఆర్ రావు, సత్యవ్రత్‌లు దేశానికి ఎనలేని సేవచేశారని కొనియాడారు. వారిని సత్కరించే అవకాశం తనకు రావడం సంతోషదాయకమని చె ప్పారు. వారిని భారతదేశ యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సీఎన్ఆర్ రావు మాట్లాడుతూ... వచ్చే 15 ఏళ్లలో సైన్స్ రంగం లో ప్రపంచంలో మనదేశం అగ్రస్థానానికి చేరుకుంటుందన్నారు.ఇతర దేశాలతో పోల్చితే మనదేశంలో సైన్స్‌లో విశేష ప్రతిభగల పరిశోధకులు ఉన్నారని తెలిపారు. వారిని ప్రోత్సహించి వనరులు సమకూర్చితే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. సరికొత్త ఆవిష్కరణలు వారితోనే సాధ్యమన్నారు. దీనికితోడు నాణ్యతగల బోధన లభించడం లేదని, దీన్ని మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. శక్తి వంచన లేకుండా దేశం కోసం వివిధ రంగాల్లో కృషి చేసిన వారిని సత్కరించడాన్ని బాధ్యతగా తీసుకున్నామని మేనేజింగ్ ట్రస్టీ బసవరాజు అన్నారు. ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ఎల్‌ఎస్‌ఆర్‌కే అవార్డులను కూడా సీఎన్‌ఆర్‌రావు, సత్యవ్రత్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు జస్టిస్ వి. భాస్కరరావు, అప్పారావు, కె. రాజశేఖర్, ఎ. గోపాల్‌రెడ్డి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
‘భారతరత్న’కు ఇచ్చే గౌరవం ఇదేనా?
కేఐఏఎల్కు విచ్చేసిన భారతరత్న సీఎన్ఆర్ రావు కానరాని ప్రభుత్వ ప్రతినిధులు దొడ్డబళ్లాపురం, న్యూస్‌లైన్ : అత్యున్నత పురస్కారం భారతరత్న అందుకున్న ప్రఖ్యాత శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావు బుధవారం మధ్యాహ్నం దేవనహళ్లిలోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగారు. ఈ సందర్భంగా ఆయన కు కుటుంబ సభ్యులు, మిత్రులు అభినందనలతో ముంచెత్తి ఆప్యాయంగా స్వాగతించారు. చింతించాల్సిన విషయం ఎమంటే రాష్ట్రానికి భారతరత్న తీసుకువచ్చిన సీఎన్ఆర్ రావును స్వాగతించడానికి ప్రభుత్వ ప్రతినిధులుగా ఒక్కరూ రాకపోవడం గమనార్హం. ఎయిర్‌పోర్టు పాలక మండలి అధికారులు సైతం విధులు పక్కనపెట్టి రావును అభినందించారు. మీడియా ప్రతినిధుల కోలాహలం తప్ప ఎయిర్‌పోర్టులో మరేమీ కనిపించలేదు. భారతరత్నకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని పలువురు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా సీఎన్ఆర్ రావు మీడియాతో మాట్లాడుతూ భారత అత్యున్న పురస్కారం భారతరత్నం లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విజ్ఞానానికి దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. ఇది యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని, యువత విజ్ఞానం దిశగా ఆసక్తి పెంపొందించుకోవాలని కోరారు. తన జీవితాన్ని విజ్ఞానపర పరిశోధనలకు అంకితమిచ్చానన న్నారు. విజ్ఞానపరంగా దేశంలో మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. శ్రీమతి సీఎన్ఆర్ రావు మాట్లాడుతూ ... ఆయన కష్టానికి తగిన ఫలితం భారతరత్న అన్నారు. -
భారతరత్న అందుకున్న రావు, సచిన్
దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేసిన రాష్ట్రపతి న్యూఢిల్లీ: ప్రఖ్యాత శాస్త్రవేత్త చింతామణి నాగేశ రామచంద్రరావు (సీఎన్ఆర్ రావు)(79), క్రికెట్ క్రీడా దిగ్గజం సచిన్ రమేశ్ టెండూల్కర్(40)లకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ‘ఇది అద్భుతం. ఈ పురస్కారం అన్నిటికన్నా ముఖ్యమైనది. నా సొంతదేశం నన్ను భారతరత్నతో గౌరవించడాన్ని మరి దేంతోనూ పోల్చలేను’ అని పురస్కార ప్రదాన కార్యక్రమం అనంతరం సీఎన్ఆర్ రావు ఆనందోద్వేగాలతో వ్యాఖ్యానించారు. కార్యక్రమానికి వచ్చిన టెండూల్కర్ అభిమానులను అదుపు చేయడం రాష్ట్రపతి భవన్ సిబ్బందికి తలకు మించిన భారమైంది. సీఎన్ఆర్ రావు, టెండూల్కర్.. ఈ ఇద్దరూ గతంలో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ను అందుకున్నవారే. రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ఈ అవార్డ్ అందుకున్న ఏకైక వ్యక్తి సచిన్ కావడం విశేషం. 1954 నుంచి ఇప్పటివరకు వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 43 మందికి భారత ప్రభుత్వం ఈ పురస్కారం ప్రకటించింది. భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ సీ రాజగోపాలాచారిని 1954లో మొట్టమొదటి భారతరత్నగా గౌరవించారు. గత నాలుగేళ్లుగా భారతరత్న పురస్కారాన్ని ప్రకటించలేదు. చివరగా 2009లో హిందూస్థానీ సంగీతజ్ఞుడు భీమ్సేన్జోషికి ప్రకటించారు. సీఎన్ఆర్ రావు గురించి.. ‘సాలిడ్ స్టేట్ అండ్ మెటీరియల్స్ కెమిస్ట్రీ’లో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త. ఇప్పటివరకు ఆయన 45 పుస్తకాలను,1,400 పరిశోధన పత్రాలను ప్రచురించారు. అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. సీవీ రామన్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తరువాత భారతరత్న అందుకున్న మూడో శాస్త్రవేత్త. భారత ప్రధానమంత్రి శాస్త్ర సలహా మండలికి ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్నారు. ఇతర దేశాలు మెరుగ్గా ఉన్నాయి ‘శాస్త్ర రంగంలో భారత్ కృషి బాగానే ఉంది. అయితే, ఇతర దేశాలు ఇంకా మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి. దక్షిణ కొరియా, చైనాలు పరిశోధనపై అధిక మొత్తాలను వెచ్చిస్తున్నాయి. పద్మ అవార్డుల తాజా జాబితాలో 14 మంది శాస్త్రజ్ఞులకు స్థానం కల్పించడం మంచి సంకేతం. త్వరలో నాకు 80 ఏళ్లు వస్తాయి. అయినా, రానున్న రోజుల్లో ఒక ముఖ్యమైన లక్ష్యం సాధించగలనని ఆశిస్తున్నాను’ - ప్రదానోత్సవం అనంతరం మీడియాతో సీఎన్ఆర్ రావు -
సచిన్, సీఎన్ఆర్కు భారతరత్న ప్రదానం
-
సచిన్, సీఎన్ఆర్ రావుకు భారతరత్న ప్రదానం
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డును భారత క్రికెట్ దిగ్గజం సచిన్ రమేష్ టెండూల్కర్, ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావులు అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో దర్బార్ హాల్లో ప్రణబ్ ముఖర్జీ మంగళవారం వీరికి అవార్డులు ప్రదానం చేశారు. వీరితో పాటు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 41 మందికి పద్మ పురస్కారాలను రాష్ట్రపతి అందజేస్తారు. సచిన్ గత ఏడాది రిటైర్మెంట్ అయిన రోజునే ప్రభుత్వం అతనితో పాటు ప్రముఖ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావుకు దేశ అత్యున్నత పౌరపురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. క్రికెట్ కెరీర్ అరంగేట్రంతోనే రికార్డుల్లోకెక్కిన సచిన్...ఈ అవార్డు అందుకుంటున్న తొలి క్రీడాకారుడుగా రికార్డులకెక్కాడు. సచిన్, రావులిద్దరూ ఇదివరకే దేశ రెండో అత్యున్నత పురస్కారమైన 'పద్మ విభూషణ్' అందుకున్నారు. భారత రత్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి సచిన్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. -
సచిన్‌కు నేడు ‘భారతరత్న’ ప్రదానం
-
సచిన్‌కు నేడు ‘భారతరత్న’ ప్రదానం
న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ‘భారతరత్న’ పురస్కారాన్ని మంగళవారం ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో ఈ వేడుక జరుగనుంది. సచిన్ గతేడాది రిటైర్మెంట్ అయిన రోజునే భారత ప్రభుత్వం అతనితో పాటు ప్రముఖ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావుకు దేశ అత్యున్నత పౌరపురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. క్రికెట్ కెరీర్ అరంగేట్రంతోనే రికార్డుల్లోకెక్కిన (పిన్న వయస్కుడిగా) ఈ ముంబైకర్ నిష్ర్కమణతోనూ ఈ అవార్డు అందుకుంటున్న తొలి క్రీడాకారుడుగా రికార్డులకెక్కాడు. సచిన్, రావులిద్దరూ ఇదివరకే దేశ రెండో అత్యున్నత పురస్కారమైన ‘పద్మ విభూషణ్’ అందుకున్నారు. వీరితో పాటు వివిధ రంగాల్లో విశేష కృషితో పద్మ పురస్కారాలకు ఎంపికైన 41 మందికి కూడా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డులను అందజేస్తారు. ‘క్రీడా ప్రపంచంలోనే సచిన్ టెండూల్కర్ గొప్ప దిగ్గజం. అంతర్జాతీయ క్రికెట్లో అతను సాధించిన రికార్డులు నిరుపమానం. అతనికి అతనే సాటి. కెరీర్ అసాంతం సమున్నతమైన క్రీడాస్ఫూర్తిని చాటిన మహోన్నత వ్యక్తిత్వం సచిన్‌ది. అందువల్లే కెరీర్లో రికార్డులు... తన కీర్తికిరీటంలో అవార్డులు సాధించగలిగాడు’ అని కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కొనియాడింది. -
సైన్స్ అభివృద్ధికి పరిశ్రమల సాయం అంతంతే
భారతరత్న సీఎన్ఆర్ రావు న్యూఢిల్లీ: దేశంలో సైన్స్ అభివృద్ధికి పారిశ్రామిక రంగం అందిస్తున్న సాయం అంతంత మాత్రమేనని ప్రముఖ శాస్త్రవేత్త, భారతరత్న సీఎన్ఆర్ రావు అన్నారు. ఈ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన పారిశ్రామికరంగం తీసికట్టుగా ఉందన్నారు. మనదేశంలో సైన్స్ అభివృద్ధికి వెచ్చిస్తున్న వ్యయంలో 90 శాతం వాటా ప్రభుత్వానిదేనని తెలిపారు. ఎన్డీటీవీ తన 25వ వార్షికోత్సవం సందర్భంగా శనివారమిక్కడ నిర్వహించిన చర్చాకార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్‌లో శాస్త్ర అభివృద్ధికి మరింత ప్రోత్సాహం, సహకారం అవసరమన్నారు. చర్చలో వ్యవసాయ నిపుణుడు స్వామినాథన్, టీసీఎస్ సీఈఓ చంద్రశేఖరన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎన్డీటీవీ తన వార్షికోత్సవాల సందర్భంగా ‘భారత్‌కు చెందిన 25 మంది సజీవ ప్రపంచ దిగ్గజాల’ను ఆదివారం రాష్ట్రపతి భవన్లో అవార్డులతో సత్కరించింది. అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ.. భారత్ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే విద్య, పరిశోధన రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టాలన్నారు. భారత్ వ్యవసాయ పరిశోధనకు ఖర్చు చేస్తున్న వ్యయం తక్కుగా ఉందని వ్యవసాయ నిపుణుడు స్వామినాథన్ ఆందోళన వ్యక్తం చేశారు. పురస్కారాలు అందుకున్న వారిలో స్వామినాథన్, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్, క్రీడాకారులు సచిన్ టెండూల్కర్, కపిల్‌దేవ్, లియాండర్ పేస్, సినీనటులు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, షారుక్ ఖాన్, వహీదా రెహమాన్, సంగీత దర్శకుడు ఏఆర్ రె హమాన్ తదితరులు ఉన్నారు. -
ఇస్రోది మూఢనమ్మకమే : సీఎన్ఆర్ రావు
ఇస్రో అధికారుల తిరుపతి యాత్రపై శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావు వ్యాఖ్య సాక్షి ప్రతినిధి, బెంగళూరు : అంతరిక్ష ప్రయోగాలకు ముందు ఇస్రో అధికారుల తిరుమల బాలాజీ దర్శనానిని వెళ్లడం మూఢనమ్మకమేనని భారతరత్న పురస్కారానికి ఎంపికైన ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు అభిప్రాయపడ్డారు. అలాంటి వాటిని తాను నమ్మనని ఇక్కడ విలేఖరుల సమావేశంలో చెప్పారు. ఇస్రో శాటిలైట్ ప్రయోగించే ముందు దాని ప్రతిరూపాన్ని వెంకటేశ్వరస్వామి పాదాల వద్ద ఉంచడం మూఢనమ్మకం కాదా అని ఒక విలేఖరి ప్రశ్నకు పైవిధంగా స్పందించారు. సాధారణ ప్రజల్లాగే శాస్త్రవేత్తకు కూడా వ్యవహరిస్తే ఏం చేయాలని ప్రశ్నించారు. తనకు జ్యోతిష్యంతో సహా మరే ఇతర మూఢ నమ్మకాలూ లేవన్నారు. తాను ఐటీకి వ్యతిరేకిననే ముద్ర వేయడం సరైంది కాదన్నారు. యువత అంతా ఐటీ వైపు చూస్తుండంతో ఇతర విభాగాలు నష్టపోతున్నాయదే తన అభిప్రాయమని చెప్పారు. భారత యువతతో పట్టుదల కొరవడిందని చెప్పారు. జవహార్‌లాల్ నెహ్రూ అడ్వాన్స్ సైంటిఫిక్ రీసెర్చ్‌లో బెంగళూరు విద్యార్థులు చోటు దక్కించుకోలేకపోతున్నారని, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ, బీహార్ ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయని చెప్పారు. పరిశోధనలకు పరిశ్రమలు తోడ్పాటునివ్వాలని, పరిశోధనల ద్వారా లబ్ధి పొందుతున్న పరిశ్రమలు ఆ బాధ్యతను మోయాల్సి ఉంటుందన్నారు. -
చైనీస్ సైన్స్ అకాడమీలో సీఎన్ఆర్ రావుకు చోటు
బెంగళూరు: భారతరత్న, ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావుకు మరో అరుదైన గౌరవం. ప్రతిష్టాత్మకమైన చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్(సీఏఎస్)లో ఆయనకు గౌరవ విదేశీ సభ్యుడి హోదా దక్కింది. ఒక భారతీయ శాస్త్రవేత్తకు సీఏఎస్‌లో చోటు దక్కడం ఇదే తొలిసారి. సీఏఎస్‌లో నోబెల్ బహుమతి అందుకున్న పలువురు శాస్త్రవేత్తలతోపాటు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సైంటిస్టులు సభ్యులుగా ఉన్నారు. ఈనెల 4న సర్వసభ్య సమావేశంలో సీఏఎస్ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని బెంగళూరులోని జవహర్లాల్ నెహ్రూ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ ఒక ప్రకటనలో తెలిపింది. -
సచిన్, సీఎన్ఆర్ రావులకు భారతరత్న
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు జాతీయం 6 రాష్ట్రాలకు పర్యావరణ మంత్రిత్వశాఖ ఆదేశాలు 60,000 చ.కి.మీ పరిధిలో విస్తరించిన పశ్చిమ కనుమల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిలిపేయాలని ఆరు రాష్ట్రాలను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నవంబర్ 14న కోరింది. ఇందులో భాగంగా మైనింగ్, క్వారీయింగ్, విద్యుత్ కేంద్రాల ఏర్పాటు వంటివాటిని నిషేధిస్తూ కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌లకు ఆదేశాలు జారీచేసింది. పశ్చిమ కనుమలపై కె.కస్తూరి రంగన్ నేతృత్వంలోని ప్యానెల్ నివేదికను ఆమోదించిన తర్వాత పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ ప్రధాని కెమెరూన్ భారత్ పర్యటన బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కెమెరూన్ భారత్ పర్యటనలో నవంబర్ 14న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య 2010 నుంచి వాణిజ్యం, పెట్టుబడుల్లో అత్యుత్తమ ప్రగతి చోటు చేసుకున్నట్లు నేతలు అంగీకరించారు. ద్వైపాక్షిక, ఆర్థిక, వాణిజ్య సంబంధాల్లో ప్రగతిని వారు సమీక్షించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనం, యూరోజోన్‌లో కష్టనష్టాలు ఉన్నప్పటికీ భారత్-యూకే వాణిజ్యం పుంజుకోవడం పట్ల ఇరు దేశాల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీలంకలో జరిగే చోగమ్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్తున్న కెమెరూన్ భారత్‌లో ఆగి న్యూఢిల్లీ, కోల్‌కతాలను సందర్శించారు. అవినీతి, నేరాలు అరికట్టడంపై సదస్సు సీబీఐ స్వర్ణోత్సవాల సందర్భంగా మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును నవంబర్ 11 నుంచి న్యూఢిల్లీలో నిర్వహించారు. ‘అవినీతి, నేరాలు అరికట్టడంపై ఉమ్మడి వ్యూహాల రూపకల్పన’ అనే అంశంపై ఈ సదస్సు జరిగింది. ఇందులో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ పాలనాపరమైన నిర్ణయాలపై దర్యాప్తు చేసేటప్పుడు దర్యాప్తు సంస్థలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సత్వర నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా, అవి అసమంజసంగా ఉండరాదని సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా పేర్కొన్నారు. ఈ సదస్సులో సీబీఐ అధికారులు, 19 దేశాల నుంచి పరిశోధనాధికారులు, రాష్ట్రాలు, అవినీతి నిరోధక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై విచారణ చేపట్టేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీర్మానం ద్వారా 1963, ఏప్రిల్ 1న సీబీఐ ఏర్పడింది. తర్వాత దీని పరిధి విస్తరిస్తూ వస్తోంది. మొదటి సీబీఐ డెరైక్టర్‌గా డీపీ కోహ్లీ పనిచేశారు. ఆయన 1963, ఏప్రిల్ 1నుంచి 1968, మే 31వరకు విధులు నిర్వర్తించారు. ఐఎన్ఎస్ విక్రమాదిత్య భారత్‌కు అప్పగింత విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య రష్యా సముద్ర తీరంలో నవంబర్ 16న భారత నౌకాదళంలో చేరింది. రష్యా ఆధునీకరించిన ఈ నౌక అప్పగింత కార్యక్రమంలో భారత రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోనీ, రష్యా ఉప ప్రధాని దిమిత్రీ రోగోజిన్ పాల్గొన్నారు. ఈ నౌక 2014, ఫిబ్రవరిలో భారత్‌కు చేరుకుంటుంది. భారత నౌకాదళంలోకెల్లా ఇది అతిపెద్ద, అతిబరువైన నౌక. దీని పొడవు 284 మీటర్లు, ఎత్తు 60 మీటర్లు, బరువు 44,500 టన్నులు. 16 మిగ్-29కె, ఆరు కామోవ్ 31, ఆరు సీకింగ్, 4 చేతక్ యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను ఇందులో మోహరింపచేయొచ్చు. దీని కొనుగోలుకు 2004లో భారత్-రష్యాల మధ్య ఒప్పందం కుదిరింది. 2008లో అప్పగించాల్సి ఉంది. నిర్మాణ వ్యయం పెరగడం కారణంగా అదనపు వ్యయంతో ఐదేళ్ల ఆలస్యంగా రష్యా.. భారత్‌కు అప్పగించింది. ఇటువంటి అత్యాధునిక విమానవాహక నౌక చేరికతో రష్యా, యూకే, ఫ్రాన్స, బ్రెజిల్ దేశాల జాబితాలో భారత్ చేరింది. ఆసియాలో ఇటువంటి నౌకగల దేశంగా భారత్ నిలుస్తోంది. రష్యా 1987లో ఈ నౌకను ‘బకు’ పేరుతో తన నౌకాదళంలో ప్రవేశపెట్టి ఆపై దీనికి అడ్మిరల్ గోర్ష్కోవ్ అని నామకరణం చేసింది. 1996లో తన నౌకాదళ సేవల నుంచి తొలగించాక దీన్ని ఆధునీకరించి భారత్‌కు విక్రయించింది. ప్రముఖ హిందీ రచయిత దేవ్‌సారే మృతి ప్రముఖ హిందీ రచయిత హరికృష్ణ దేవ్‌సారే (75) ఘజియాబాద్‌లో నవంబర్ 14న మరణించారు. పిల్లల సాహిత్యంలో ఆయన రచనలు బాగా పేరొందాయి. ఆయన 300 కు పైగా పుస్తకాలు రాశారు. హిందీ అకాడెమీ అందించే సాహిత్యకార్ సమ్మాన్తోపాటు అనేక పురస్కారాలను అందుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తై ఆలయానికి శంకుస్థాపన ప్రపంచంలోనే అత్యంత ఎత్తై ఆలయానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నవంబర్ 13న శంకుస్థాపన చేశారు. 200 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ఆలయం ప్రపంచంలో ఎత్తైదిగా గుర్తింపు పొందనుంది. బీహార్ రాజధాని పాట్నాకు 120 కి.మీ దూరంలో తూర్పు చంపారన్ జిల్లాలోని కేషరియాలో ఈ విరాట్ రామాయణ్ మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఆసియా - యూరప్ మంత్రుల సమావేశం ఆసియా- యూరప్ విదేశాంగ మంత్రుల, అధికారుల సమావేశం న్యూఢిల్లీలో న వంబర్ 11, 12 తేదీల్లో జరిగింది. ఈ 11వ ఆసియా - యూరప్ సమావేశం (ఆసెమ్)లో ‘ఆసెమ్ వృద్ధి, అభివృద్ధి కోసం భాగస్వామ్య నిర్మాణం’ అనే అంశాన్ని ఇతివృత్తంగా చేపట్టారు. ఇందులో సైబర్ క్రైమ్ ప్రధాన చర్చనీయాంశమైంది. సుస్థిర అభివృద్ధి, ఇంధన సామర్థ్యం, టెక్నాలజీలతో సహా 12 అంశాల్లో సహకరించుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి 36 దేశాల విదేశాంగ మంత్రులతోపాటు మొత్తం 49 దేశాల ప్రతినిధులు, యూరోపియన్ కమిషన్, ఆసియా సెక్రటేరియట్ ప్రతినిధులు హాజరయ్యారు. ప్రపంచ జనాభాలో 60 శాతం జనాభా ఆసెమ్ దేశాల్లోనే ఉంది. జీడీపీలో 52 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 68 శాతం ఆసెమ్ దేశాలదే. ఆసియా, యూరప్ భాగస్వామాన్ని అభివృద్ధి చేసేందుకు ఆసెమ్ను 1994లో సింగపూర్, ఫ్రాన్స్‌లు ప్రారంభించాయి. తర్వాత మొదటి సమావేశం 1996, మార్చిలో బ్యాంకాక్‌లో జరిగింది. మాల్దీవుల అధ్యక్షుడిగా అబ్దుల్లా యమీన్ ఎన్నిక మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా ఆర్థికవేత్త అబ్దుల్లా యమీన్ గయూం(54) నవంబర్ 17న ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా మహ్మద్ మౌమూన్ జమీల్ ప్రమాణం చేశారు. నవంబర్ 16న జరిగిన రన్ ఆఫ్ రౌండ్ పోలింగ్‌లో అబ్దుల్లా ప్రొగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ అభ్యర్థిగా పోటీచేసి 51.39 శాతం ఓట్లు సాధించారు. మాజీ అధ్యక్షుడు మాల్దీవ్స్ డెమోక్రటిక్ అభ్యర్థి మహ్మద్ నషీద్‌కు 48.61 శాతం ఓట్లు లభించాయి. దాదాపు మూడు దశాబ్దాలపాటు మాల్దీవులను పాలించిన మాజీ అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్ సవతి సోదరుడు యమీన్. ప్రముఖ రచయిత్రి డోరిస్ లెస్సింగ్ మృతి నోబెల్ బహుమతి గ్రహీత ప్రముఖ రచయిత్రి డోరిస్ లెస్సింగ్ (94) లండన్‌లో నవంబర్ 16న మరణించారు. ఆమెకు 2007లో సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ దక్కింది. ఆమె ‘ది గోల్డెన్ నోట్‌బుక్’తోపాటు అనేక నవలలు, నాటకాలు రాశారు. 55 పుస్తకాలు ప్రచురించారు. ఆధునిక బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం ఆధునీకరించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని భారత సైన్యం నవంబర్ 18న రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో విజయవంతంగా పరీక్షించింది. బ్లాక్-3 రకానికి చెందిన ఈ క్షిపణి 290 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 300 కిలోల సంప్రదాయ ఆయుధాలను మోసుకుపోగలదు. భూమి, సముద్రం, ఆకాశం వంటి బహుళ వేదికల నుంచి దీన్ని ప్రయోగించవచ్చు. ఈ క్షిపణిని ఇప్పటికే సైన్యం, నౌకాదళంలో ప్రవేశపెట్టారు. సచిన్, సీఎన్ఆర్ రావులకు భారతరత్న క్రికెట్ కీడాకారుడు సచిన్ టెండ్కూలర్ (40), ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు (79)లను ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డులకు ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం నవంబర్ 16న ప్రకటించింది. దీన్ని చివరిసారిగా 2009లో పండిట్ భీమ్సేన్ జోషికి ప్రదానం చేశారు. ఇంతవరకు ఈ అవార్డును మొత్తం 41 మంది అందుకున్నారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను 1954లో ఏర్పాటు చేశారు. సర్ సి.వి.రామన్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత భారతరత్నకు ఎంపికైన మూడో శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావు. ఈ అవార్డు పొందిన తొలి క్రీడాకారుడు, అతి పిన్న వయస్కుడుగా సచిన్‌కు గుర్తింపు దక్కింది. సచిన్ టెండూల్కర్: 24 ఏళ్లుగా క్రికెట్లో ఎన్నో ప్రపంచ రికార్డులను నెలకొల్పిన సచిన్ తన 200వ టెస్టుతో నవంబర్ 16న ఆట నుంచి వైదొలిగారు. అదేరోజు ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రకటించింది. ఇప్పటికే ఆయన పద్మవిభూషణ్ కూడా అందుకున్నారు. క్రీడా ప్రపంచంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అసలైన రాయబారి టెండ్కూలర్ అని కేంద్రం అధికారిక ప్రకటనలో పేర్కొంది. 16 ఏళ్ల వయసులో పాకిస్థాన్‌పై కరాచీలో 1989, నవంబర్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో సచిన్ టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టారు. టెస్టుల్లో మొత్తం 15,921 పరుగులు చేశారు. ఇందులో 51 సెంచరీలు, 68 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 248 నాటౌట్. అదేవిధంగా 1989, డిసెంబర్ 18న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌తో వన్డే క్రికెట్లో కాలుమోపారు. వన్డేల్లో మొత్తం 463 మ్యాచ్‌లు ఆడి, 18,426 పరుగులు చేశారు. ఇందులో 49 సెంచరీలు, 96 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 200 నాటౌట్. ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు: పూర్తిపేరు చింతామణి నాగేశ రామచంద్రరావు. 2005 నుంచి ప్రధానమంత్రి శాస్త్ర సలహామండలి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సీఎన్ఆర్ రావును కేంద్రం రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. ఆయన సాలిడ్ స్టేట్, మెటీరియల్స్ కెమిస్ట్రీలో అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన శాస్త్రవేత్త. నాన్ మెటీరియల్స్, గ్రాఫీన్‌లపై రెండు దశాబ్దాలుగా విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. ఆయన దాదాపు 1400 పరిశోధన పత్రాలు, 45 పుస్తకాలు ప్రచురించారు. ప్రపంచవ్యాప్తంగా 60 విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. సీఎన్ఆర్ రావు 1934, జూన్ 30న బెంగళూరులో జన్మించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ చేశారు. అమెరికాలోని పర్డ్యు యూనివర్సిటీ నుంచి 1958లో పీహెచ్డీ అందుకున్నారు. ఐఐటీ కాన్పూర్‌లో రసాయనశాస్త్ర అధిపతిగా 13 ఏళ్లు పనిచేశారు. 1984లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు 2005లో నోబెల్ బహుమతితో సమానమైన పది లక్షల డాలర్ల డాన్ డేవిడ్ ప్రైజ్ లభించింది. క్రీడలు జొకోవిచ్‌కు ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ టైటిల్ గెలుచుకున్నాడు. లండన్‌లో నవంబర్ 12న జరిగిన ఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్‌వన్ రఫెల్ నాదల్ (స్పెయిన్)ను జొకోవిచ్ ఓడించాడు. దక్షిణాసియా జూనియర్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు అగ్రస్థానం దక్షిణాసియా జూనియర్ అథ్లెటిక్స్‌లో భారత్ మొత్తం 52 పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది. రాంచీలో నవంబర్ 12న ముగిసిన పోటీల్లో భారత్ 20 స్వర్ణాలు, 20 రజతాలు, 12 కాంస్య పతకాలతో మొత్తం 52 పతకాలు సాధించింది. శ్రీలంక 10 స్వర్ణాలు, 10 రజతాలు, 14 కాంస్య పతకాలు సాధించి రెండో స్థానం దక్కించుకుంది. అథ్లెట్స్ ఆఫ్ ది ఇయర్‌గా బోల్ట్, ప్రాసెర్ - ప్రెసి జమైకా స్ప్రింట్ క్రీడాకారులు ఉసేస్ బోల్ట్, షెల్లీ ఆన్ ప్రాసెర్-ప్రెసిలు 2013 సంవత్సరానికి ఐఏఏఎఫ్ పురుషుల, మహిళల వరల్డ్ అథ్లెట్స్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. ఈ అవార్డులను నవంబర్ 16న మాంటెకార్లోలో బహూకరించారు. ఈ అవార్డును బోల్ట్ 2008, 2009, 2011, 2012లో కూడా దక్కించుకున్నాడు. టెస్ట్ సిరీస్ విజేత ఇండియా వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. నవంబర్ 16న ముగిసిన రెండో టెస్టును కూడా భారత్ గెలుచుకోవడంతో సిరీస్ భారత్ వశమైంది. తన చివరి టెస్ట్‌లో సచిన్ 74 పరుగులు చేశారు. రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా, ప్రజ్ఞాన్ ఓజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యారు. చెక్ రిపబ్లిక్కు డేవిస్ కప్ ప్రపంచ టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ డేవిస్ కప్ టైటిల్‌ను చెక్ రిపబ్లిక్ నిలబెట్టుకుంది. బెల్గ్రేడ్లో నవంబర్ 18న ముగిసిన ఫైనల్స్‌లో సెర్బియాను ఓడించి చెక్ రిపబ్లిక్ విజేతగా నిలిచింది. వెటెల్‌కు యూఎస్ గ్రాండ్ ప్రి టైటిల్ రెడ్‌బుల్ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఫార్ములావన్ యూఎస్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను గెలుచుకున్నాడు. నవంబర్ 18న వెస్టిన్‌లో జరిగిన రేసులో వెటెల్ మొదటి స్థానంలో నిలిచాడు. లోటస్ డ్రైవర్ గ్రోస్యెన్‌కు రెండో స్థానం దక్కింది. ఈ గెలుపుతో ఈ సీజన్లో వరుసగా ఎనిమిది విజయాలు సాధించిన తొలి డ్రైవర్‌గా వెటెల్ రికార్డు నెలకొల్పాడు. టైమ్ ‘పర్సన్ ఆఫ్ ద వీక్’ సచిన్ ప్రఖ్యాత ‘టైమ్’ మ్యాగజైన్ సచిన్ టెండ్కూలర్‌ను ‘పర్సన్ ఆఫ్ ద వీక్’ గౌరవంతో సత్కరించింది. మ్యాగజైన్ ఆన్లైన్ పోల్‌లో సచిన్‌కు 54 (88 శాతం) ఓట్లు వచ్చాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ హెడ్ నోమిని జనెట్ యెలెన్ 13.41 శాతం, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ 6.1 శాతం ఓట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. -
సైన్స్‌పై యువత ఆసక్తి చూపాలి
సాక్షి, బెంగళూరు: ఐటీ, బీటీ, వైద్య రంగాలపైనే మక్కువ చూపకుండా విజ్ఞానశాస్త్రంపై కూడా ఆసక్తి చూపాలని భారతరత్న పురస్కార విజేత, ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్.రావు యువతకు పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే రెండో పెద్ద దేశమైన భారత్‌లో సైన్స్‌కు అత్యంత ప్రాధాన్యతనిచ్చి 20 సంవత్సరాల రూట్‌మ్యాప్‌తో అభివృద్ధి పథంలో సాగాల్సి ఉందన్నారు. బెంగళూరులోని జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్‌లో సోమవారం జరిగిన ఓ సెమినార్లో ఆయన ప్రసంగిస్తూ.. భారత్ నేడు అన్ని రంగాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని.. ఆయా రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యత విజ్ఞాన శాస్త్ర రంగానికి ఇవ్వటం లేదని విచారం వ్యక్తంచేశారు. ‘రాజకీయ నేతలు మూర్ఖులు’ అని తాను ఎవరినో అవమానించే ఉద్దేశంతో వ్యాఖ్యానించ లేదని రావు పేర్కొన్నారు. దీనిని ఎవరూ తప్పుగా భావించ వద్దని కోరారు. ‘ముందు వాళ్లు సైన్స్ ప్రాధాన్యతను అర్థంచేసుకోవాలి. మన అవసరాలకు అనుగుణుంగా నిధులు కేటాయించాలి. తద్వారా భారత్ అభివృద్ధిసాధిస్తుంది. కానీ దీనిని అర్థం చేసుకోవటం లేదు. అది కొంత మూర్ఖపు పరిస్థితి’ అని మాత్రమే నేనన్నాను.. అదీ కోపంగా కాదు. నేను కోపిష్టిని కాదు’’ అని వివరణ ఇచ్చారు. -
ధర్మాగ్రహం...!
రాజకీయ నాయకులను విమర్శించడం, వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం మన దేశంలో కొత్తకాదు. ధనం, కులం, మతం, ప్రాంతం, నేరం వంటి అనేకానేక చట్రాల్లో ఇరుక్కుపోయిన రాజకీయరంగంలో... విశ్వసనీయత అన్న పదమే పరాయిదైపోయింది. గెలుపే లక్ష్యంగా, అధికారమే ధ్యేయంగా పనిచేసే రాజకీయ నాయకులవల్లా, పార్టీలవల్లా ఈ పరిస్థితి నానాటికీ దిగజారుతూనే ఉంది. ఈ స్థితిపై ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తడంలో వింతేమీ లేదు. అలాంటివారిలో భారతరత్న పురస్కారాన్ని అందుకోనున్న శాస్త్రవేత్త, ప్రధాని సాంకేతిక వ్యవహారాల సలహా మండలి చైర్మన్ ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు చేరారు. భారతరత్న ప్రకటించిన మర్నాడే ఆయన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులంతా ఉత్త మూర్ఖులని అన్నట్టు మీడియాలో వచ్చింది. అయితే, తాను రాజకీయ నాయకులందరినీ అనలేదని, అసలు తానన్న మాటల్నే మీడియా వక్రీకరించిందని ఆయన వివరణనిస్తున్నారు. ఆయన రాజకీయ నాయకుల్ని ఏమన్నారన్న సంగతిని పక్కనబెడితే ఆ సందర్భంగా ఆయన లేవనెత్తిన అంశాలు మాత్రం చాలా విలువైనవి. మన దేశంలో శాస్త్ర విజ్ఞాన పరిశోధనలకు మరిన్ని నిధులు కేటాయించాల్సి ఉన్నదని ఆయనన్నారు. ప్రభుత్వం ఇస్తున్న నిధులతో పోలిస్తే శాస్త్రవేత్తలు చేస్తున్నది చాలా ఎక్కువేనని కూడా ఆయన చెప్పారు. పరిశోధనా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న తీరుపై ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు గతంలోనూ అసంతృప్తి వ్యక్తంచేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా ఉండాలన్నా... కనీసం ఇప్పుడున్న స్థితికంటే ముందుకెళ్లాలన్నా ఇతోధికంగా నిధులివ్వాల్సిన అవసరం ఉన్నదని ఆయన ఏడాదిక్రితం సూచించారు. ఆయన మాటకు విలువిచ్చి నిధులు పెంచుతామని ప్రధాని హామీ ఇచ్చినా అది సాకారం కాలేదు. విజ్ఞాన శాస్త్ర రంగంలో ప్రొఫెసర్ సీవీ రామన్ నోబెల్ బహుమతి సాధించి 84ఏళ్లు కావస్తున్నది. అటు తర్వాత అందుకు సరితూగగల పరిశోధనలేవీ మన దేశంనుంచి లేవంటేనే మనం ఎక్కడున్నామో అర్ధమవుతుంది. అసలు ప్రామాణికమైన విద్యనందించే అగ్రశ్రేణి సంస్థలే మన దేశంలో కరువయ్యాయి. మొన్నామధ్య మన ఐఐటీల గురించి, వాటి స్థితిగతుల గురించి ఒక విదేశీ రేటింగ్ సంస్థ చేసిన వ్యాఖ్యానాలు చాలామందిని నొప్పించాయి. ఆ రేటింగ్లలో శాస్త్రీయత లేదని పలువురు విమర్శించారు. కానీ, ప్రపంచంలోని అత్యుత్తమ విద్యనందించే తొలి 200 సంస్థల్లో మన దేశానికి చెందిన ఒక్కటీ లేదని అనేకసార్లు నిర్ధారణైంది. ప్రాథమిక పాఠశాలల స్థాయినుంచి విశ్వవిద్యాలయాల వరకూ విద్య విషయంలో మన ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ఆ రంగంలో నిష్ణాతులను రూపొందించడంలో పెద్ద అవరోధంగా మారాయి. పాఠశాలల్లో కనీసం మరుగుదొడ్లయినా ఉండాలన్న సంగతి సుప్రీంకోర్టు చెప్పిన రెండేళ్లకు కూడా ప్రభుత్వాలకు అర్ధంకావడంలేదు. ఇక టీచర్లు, నల్లబల్లలు, పుస్తకాలు వగైరా సంగతులు చెప్పేదేముంది? నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలద్వారా ఒకప్పుడు ప్రపంచానికి విజ్ఞానభిక్ష పెట్టిన దేశం ఇప్పుడు దీనావస్థకు చేరుకుంది. ప్రొఫెసర్ రావు చెబుతున్నదాన్నిబట్టి నవకల్పన రంగానికి సంబంధించి రూపొందించిన 140 దేశాల జాబితాలో మన దేశం స్థానం 66! విద్యారంగాన్ని గత కొన్ని దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేసిన పాలకుల పాపానికి ప్రతిఫలమిది. మన పాలకులు అవకాశం వచ్చినప్పుడల్లా విజ్ఞానశాస్త్ర రంగానికి ప్రాధాన్యమిస్తామని చెబుతారు. ఆ రంగంలో మనం వెనకబడిపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తుంటారు. ఏటా జరిగే సైన్స్ కాంగ్రెస్ సదస్సుల్లో ఆ మాదిరి మాటలు చాలా వినబడుతూ ఉంటాయి. కానీ, మన స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో కేవలం 0.9 శాతం మొత్తాన్ని మాత్రమే పరిశోధనలపై ఖర్చు పెడుతున్నట్టు నిరుడు మన్మోహన్సింగే స్వయంగా వెల్లడించారు. దీన్ని రెట్టింపు చేస్తామని ఆయన హామీ ఇచ్చినా ఆచరణలో అది ఒక శాతం మించలేదని తాజా గణాంకాలు చెబుతున్నాయి. జీడీపీలో కనీసం 6శాతాన్ని ఖర్చుచేస్తే తప్ప ఈ రంగంలో మనం ముందుకెళ్లడం సాధ్యంకాదని ప్రొఫెసర్ రావు అంటున్నారు. ఆయన చెప్పినట్టు చైనాతో పోలిస్తే ఈ రంగంలో మనం చాలా వెనకబడి ఉన్నాం. అసలు ప్రాథమ్యాలను గుర్తించడంలోనే మనకూ, చైనాకూ ఎంతో అగాథం ఉంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధపెట్టి నాణ్యమైన విద్యను అందించడానికి కృషిచేస్తోంది. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేలా పాఠ్యాంశాలను రూపొందిస్తున్నది. క్షేత్రస్థాయి సమస్యలకూ, విద్యాలయాల్లో బోధించే విద్యకూ మధ్య అనుబంధం ఉండేలా చూస్తున్నది. ప్రపంచంలో పరిశోధనా రంగానికి వెచ్చించే నిధుల్లో 7శాతం చైనాయే ఖర్చుచేస్తున్నదంటే ఆ రంగానికి అది ఇస్తున్న ప్రాముఖ్యత ఎంతో అర్ధమవుతుంది. చైనా వరకూ అవసరం లేదు... మనకంటే ఎంతో చిన్న దేశమైన దక్షిణ కొరియాతో పోల్చినా మనం ఎంతో వెనకబడి ఉన్నాం. సంఖ్యాపరంగా చూస్తే విజ్ఞాన శాస్త్రాల్లో ఏటా మన దేశంలో దాదాపు 9,000 మంది పీహెచ్‌డీలు పొందుతున్నారు. కానీ, అమెరికా నుంచి మేథోపరమైన పేటెంట్లు పొందేవారు ఏటా 4,000 మంది ఉంటే మన దేశంలో వందకు మించడంలేదు. వ్యవసాయం, వాతావరణం, వైద్యం, రక్షణ రంగాలకు ఈ పరిశోధనలవల్ల ఒనగూడే ప్రయోజనం దాదాపు ఏమీ ఉండటంలేదు. మన ఇంజనీరింగ్ కళాశాలలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తయారు చేయడానికి చూపిస్తున్న శ్రద్ధలో పదోవంతు కూడా పరిశోధనలకివ్వడం లేదు. 2010-20ని ‘సృజన దశాబ్ది’గా ప్రకటించాక కూడా ఇవే పరిస్థితులు పునరావృతమవుతున్నాయంటే మనం సిగ్గుపడాలి. ఇప్పుడు ప్రొఫెసర్ రావు చేసిన వ్యాఖ్యల పర్యవసానంగానైనా పాలకులు మేల్కొని లోపాలను సరిదిద్దాలి. పరిశోధనారంగానికి జవసత్వాలివ్వాలి. -
'రాజికీయ నాయకులు ఇడియట్స్'
-
రాజకీయ నాయకులు మూర్ఖులు
బెంగళూరు: దేశ శాస్త్ర సాంకేతిక రంగాన్ని విస్మరిస్తున్న రాజకీయ నాయకుల తీరును ‘భారతరత్న’కు ఎంపికైన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త ప్రొఫెసర్ చింతామణి నాగేశ రామచంద్రరావు (సీఎన్ఆర్ రావు) తూర్పారబట్టారు. పొరుగు దేశమైన చైనా ఈ రంగంలో దూసుకుపోతున్నా మన నేతలు మాత్రం పరిశోధనలకు పెద్దపీట వేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. శాస్త్ర రంగానికి నామమాత్రపు నిధులు విదిలిస్తున్న నేతల వైఖరిని ఆక్షేపిస్తూ వారిని మూర్ఖులు (ఇడియట్లు)గా అభివర్ణించారు. శాస్త్ర రంగంలో మరిన్ని పెట్టుబడులు పెడతామంటూ ప్రధాని మన్మోహన్సింగ్ స్వయంగా హామీ ఇచ్చినా అది ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదని ప్రధాని శాస్త్ర సలహా మండలి చైర్మన్ కూడా అయిన రావు విమర్శించారు. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డుకు కేంద్ర ప్రభుత్వం తనను శనివారం ఎంపిక చేసిన నేపథ్యంలో ఆదివారం ఆయన బెంగళూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ విలేకరి దేశంలో శాస్త్ర రంగ ప్రమాణాలపై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించగా ‘ఈ మూర్ఖపు రాజకీయ నాయకులు శాస్త్ర రంగానికి నామమాత్రపు నిధులిచ్చారు. అయినప్పటికీ మేం (శాస్త్రవేత్తలు) ఎంతో కొంత చేయగలిగాం. ఈ రంగంలో పెట్టుబడులే నామమాత్రం...పైగా దానికితోడు జాప్యం. మనకున్న నిధులనుబట్టి చూస్తే మేం (శాస్త్రవేత్తలు) బాగానే పనిచేశాం’ అంటూ ఆవేశంగా బదులిచ్చారు. మనం చైనీయుల్లా కష్టపడం శాస్త్ర, సాంకేతిక రంగంలో చైనా దూసుకుపోతున్న విషయాన్ని ప్రస్తావించగా ‘మన వెనకబాటుతనానికి మనం కూడా బాధ్యులమే. మనం భారతీయులం చైనీయుల్లాగా కష్టపడం. వారిలా జాతీయవాదులం కాదు. మనకు ఒకవేళ ఎక్కువ డబ్బు లభిస్తుందనుకుంటే విదేశాలకు వెళ్లేందుకూ సిద్ధంగా ఉంటాం’ అని వ్యాఖ్యానించారు. శాస్త్రరంగంలో పెట్టుబడులపైనే దేశ భవిత విద్య, శాస్త్ర, సాంకేతిక రంగంలో ఏ స్థాయిలో పెట్టుబడులు ఉంటాయనే దానిపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని రావు పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం పరిశోధనలకు అందాల్సిన స్థాయిలో మద్దతు లభించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నవకల్పన రంగం (ఇన్నోవేషన్)లో 140 దేశాల జాబితాలో భారత్ 66వ స్థానంలో ఉందని చెప్పారు. ‘దేశ సెన్సెక్స్, వాణిజ్యం బాగున్నంత మాత్రాన సరిపోదు. ఈ ప్రభావం ఐదు, పదేళ్లకే పరిమితం. మరి దీర్ఘకాల పరిస్థితి ఏమిటి?’ అని ప్రశ్నించారు. దేశ జీడీపీలో కనీసం ఆరు శాతాన్ని మౌలిక విద్యపై పెట్టుబడి పెట్టాలని సూచించారు. ఐటీకి, సైన్స్‌కు సంబంధం లేదు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)కి సైన్స్‌తో సంబంధం లేదని రావు పేర్కొన్నారు. కేవలం కొందరు డబ్బు సంపాదించేందుకే ఐటీ ఉందని వ్యాఖ్యానించారు. ఐటీ ఉద్యోగులు ఎప్పుడూ నిరాశావాదులని...పనిలో సంతోషం వెతుక్కోరని వ్యాఖ్యానించారు. నిరాశ వల్లే వారు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. తాను మాత్రం నేటికీ పనిలో ఆనందం వెతుక్కుంటున్నానని చెప్పారు. క్రీడలకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు: దేశంలో విలువలు, ప్రాధాన్యతలు తగ్గిపోతున్నాయని రావు ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడలు, పోలీసు, సైన్యం లేదా ఇతరులకు ఇస్తున్న ప్రాధాన్యం శాస్త్రవేత్తలకు ఇవ్వట్లేదన్నారు. 2005లో తనకు నోబెల్ బహుమతితో సమానమైన 10 లక్షల డాలర్ల డాన్ డేవిడ్ ప్రైజ్ లభించినా దాని గురించి ఎవరూ మాట్లాడలేదన్నారు. ఒకవేళ అదే అవార్డును ఇతర దేశాల్లో ఎవరికైనా వచ్చి ఉండుంటే దాని గురించి గొప్పగా చెప్పుకునేవారన్నారు. -
'రాజకీయ నాయకులు 'ఇడియెట్స్', ఐటీ నిపుణులు 'అసంతృప్తి మూక''
ప్రముఖ శాస్త్రవేత్త, భారత రత్న సీఎన్ఆర్ రావు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను 'అసంతృప్తి మూక' , రాజకీయ నేతలను 'ఇడియెట్స్' అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 'కేవలం డబ్బు కోసమే సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు పనిచేస్తారు. వాళ్లు ఒక అసంతృప్తికి గురైన గుంపు' అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ నిపుణుడు, హత్య గురైన టెకీ, విడాకులు తీసుకున్న ఐటీ ప్రొఫెషనల్ అనే హెడ్డింగ్ లతో పేపర్లో రోజు వార్తలు చదువుతాను అని అన్నారు. చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ అసంతృప్తితో జీవితం గడుపుతున్నారు. వారి జీవితం చాలా దుర్భరంగా ఉంది అని వ్యాఖ్యానించారు. అంతేకాక వాళ్లు తమ పనిని ఎంజాయ్ చేయలేరని.. తాను 80 ఏళ్ల వయస్సులో కూడా ఎంత ఆనందంగా ఉన్నానో చూడండి అన్నారు. కేవలం క్రీడలకు, ఆర్మీ ఇతర అంశాలకే రాజకీయ నాయకులు ప్రాధాన్యత ఇస్తున్నారని.. సైంటిస్టులకు ఈ దేశంలో గుర్తింపు లేదు అని అన్నారు. 2005లో నోబెల్ బహుమతికి సమానంగా ఉండే డాన్ డేవిడ్ పురస్కారం తనకు లభించిందని, దాని విలువ ఒక మిలియన్ డాలర్లు అని అన్నారు. తనకు లభించిన పురస్కారం గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు అని అన్నారు. ఎప్పుడో ఒక్కసారి ఇచ్చే ఈ పురస్కారం ఇతర దేశాల్లో కూడా ఎవరికి లభించలేదని.. అలాంటిది తనకు లభిస్తే ఈ దేశంలో గుర్తింపు కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో శాస్త్రీయ రంగానికి ప్రభుత్వాలు నిధులు కేటాయించడం లేదని.. రాజకీయ నాయకులు ఇడియెట్స్ అని అన్నారు. శనివారం సీఎన్ఆర్ రావుకు సచిన్ తోపాటు భారత రత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ప్రొ.సీఎన్ఆర్ రావుకు భారతరత్న
-
సిఎన్ఆర్ రావుకు దక్కిన దేశ అత్యున్నత గౌరవం
సైన్స్‌లో విశేష సేవలు చేసినందుకు ప్రధాని సాంకేతిక సలహాదారుడు, ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్.రావుకు భారత ప్రభుత్వం దేశ అత్యున్న పౌర పురస్కారం 'భారతరత్న' ప్రకటించింది. భారత క్రికెట్‌కు విశేష సేవలు అందించిన సచిన్ టెండూల్కర్‌తో కలిపి రావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. రావు పూర్తి పేరు చింతామణి నాగేశ రామచంద్ర రావు. బెంగళూరులో జూన్ 30, 1934న నాగేశ్వరరావు, నాగమ్మ దంపతులకు జన్మించిన రావు సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్ రంగాలలో ప్రముఖ శాస్త్రవేత్తగా ప్రసిద్ధుడయ్యారు. ట్రాన్సిషన్ మెటల్ ఆక్సైడ్ గురించిన ఆయన పరిశోధనలు చేశారు. ప్రస్తుతం ఆయన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు శాస్త్ర, సాంకేతిక సలహాదారులుగా ఉన్నారు. మైసూర్ విశ్వవిద్యాలయంలో 1951లో డిగ్రీ పూర్తి చేశారు. కాశీ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీపూర్తి చేశారు. 1958లో ఫుర్డ్యూ యూనివర్సిటీలో పిహెచ్డి అందుకున్నారు. కాన్పూరు ఐఐటిలో దాదాపు 13 ఏళ్లు రసాయశాస్త అధ్యాపడుకుడగా పని చేశారు. 84-94 మధ్య కాలంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆక్స్ఫర్డ్, కేండ్రిడ్జి, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పని చేశారు. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రిసెర్చ్ సంస్థకు గౌరవాధ్యక్షుడుగా పని చేశారు. సి.ఎన్.ఆర్.రావు ప్రతిభను గుర్తించి దేశవిదేశాలలోని పలు సంస్థలు అనేక అవార్డులు ఇచ్చి గౌరవించాయి. ఆయనది 60 ఏళ్ల పరిశోధనా ప్రస్థానం. 45కి పైగా పుస్తకాలు రాశారు. 1500పైగా పరిశోధనా వ్యాసాలు రాశారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డులు అందజేసింది. దేశవిదేశాల నుంచి ఆయన 150కి పైగా పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 విశ్వవిద్యాలయాలు ఆయనకు డాక్టరేట్ లు ఇచ్చాయి. సి.ఎన్.ఆర్.రావు అందుకున్న అవార్డులు: 2000- హ్యూస్ మెడల్ - రాయల్ సొసైటీ 2004 - భారత ప్రభుత్వం నుండి ఇండియా సైన్సు అవార్డు పొందిన మొదటి వ్యక్తి 2005 - డాన్ డేవిడ్ ప్రైజ్ (Tel Aviv University) 2005 - ఫ్రాన్సు ప్రభుత్వ అవార్డు 1968 - శాంతి స్వరూప్ భట్నాగర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు ఇంకా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్, అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ రాయల్ సొసైటీ (లండన్), ఫ్రెంచ్ అకాడమీ, జపాన్ అకాడమీ, పోంటిఫికల్ అకాడమీ అవార్డులు ఆయన అందుకున్నారు.