‘భారతరత్న’కు ఇచ్చే గౌరవం ఇదేనా?
- కేఐఏఎల్‌కు విచ్చేసిన భారతరత్న సీఎన్‌ఆర్ రావు
- కానరాని ప్రభుత్వ ప్రతినిధులు
దొడ్డబళ్లాపురం, న్యూస్‌లైన్ : అత్యున్నత పురస్కారం భారతరత్న అందుకున్న ప్రఖ్యాత శాస్త్రవేత్త సీఎన్‌ఆర్ రావు బుధవారం మధ్యాహ్నం దేవనహళ్లిలోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగారు. ఈ సందర్భంగా ఆయన కు కుటుంబ సభ్యులు, మిత్రులు అభినందనలతో ముంచెత్తి ఆప్యాయంగా స్వాగతించారు.
చింతించాల్సిన విషయం ఎమంటే రాష్ట్రానికి భారతరత్న తీసుకువచ్చిన సీఎన్‌ఆర్ రావును స్వాగతించడానికి ప్రభుత్వ ప్రతినిధులుగా ఒక్కరూ రాకపోవడం గమనార్హం. ఎయిర్‌పోర్టు పాలక మండలి అధికారులు సైతం విధులు పక్కనపెట్టి రావును అభినందించారు. మీడియా ప్రతినిధుల కోలాహలం తప్ప ఎయిర్‌పోర్టులో మరేమీ కనిపించలేదు. భారతరత్నకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని పలువురు ఆవేదన వ్యక్తం చేసారు.
ఈ సందర్భంగా సీఎన్‌ఆర్ రావు మీడియాతో మాట్లాడుతూ భారత అత్యున్న పురస్కారం భారతరత్నం లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విజ్ఞానానికి దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. ఇది యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని, యువత విజ్ఞానం దిశగా ఆసక్తి పెంపొందించుకోవాలని కోరారు. తన జీవితాన్ని విజ్ఞానపర పరిశోధనలకు అంకితమిచ్చానన న్నారు. విజ్ఞానపరంగా దేశంలో మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. శ్రీమతి సీఎన్‌ఆర్ రావు మాట్లాడుతూ ... ఆయన కష్టానికి తగిన ఫలితం భారతరత్న అన్నారు.