ఇన్‌ఫ్రా ఫండ్స్ నుంచి వైదొలగండి | question hour with dhirendra kumar | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫ్రా ఫండ్స్ నుంచి వైదొలగండి

Published Mon, Dec 2 2013 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 AM

నేను టాటా ఇండో గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాను. కానీ ఈ ఫండ్ పనితీరు బాగా లేదు.

 నేను టాటా ఇండో గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాను. కానీ ఈ ఫండ్ పనితీరు బాగా లేదు. ప్రస్తుతం ఈ ఫండ్ ఎన్‌ఏవీ రూ. 6.58గా ఉంది. ఈ ఫండ్‌లో కొనసాగమంటారా? వైదొలగమంటారా? ఒక వేళ వైదొలిగితే ఆ పెట్టుబడులను దేంట్లో ఇన్వెస్ట్ చేయాలో తెలుపగలరు.
 - నాని, హైదరాబాద్
 
 చాలా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ఇన్వెస్టర్లను బాగా నిరాశ పరుస్తున్నాయి. అందుకే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ నుంచి వైదొలగమని సూచిస్తున్నాం. ఇక మీ విషయానికొస్తే, తక్షణం ఈ ఫండ్ నుంచి బయటకు వచ్చేయండి. ఈ ఫండే కాదు, మరే ఇతర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్‌కైనా  ఇది వర్తిస్తుంది. ఇన్‌ఫ్రా ఫండ్స్‌కు మంచి రోజులు ముగిశాయి. ఇప్పట్లో ఈ ఫండ్స్ కోలుకునే సూచనలు లేవు. ఇన్‌ఫ్రా కంపెనీలు మంచి ఆదాయాన్ని ఆర్జించే పరిస్థితులైతే ఇప్పుడు లేవు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ఫార్మా, టెక్నాలజీ, ఎఫ్‌ఎంసీజీ మినహా ఇతర రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కానీ గత కొన్నేళ్లుగా ఫార్మా, టెక్నాలజీ, ఎఫ్‌ఎంసీజీ కంపెనీల షేర్లే మంచి ఆదాయాన్నిస్తున్నాయి. మీ పెట్టుబడులను నార్మల్ డైవర్సిఫైడ్ ఫండ్‌కు మళ్లించవచ్చు.
 
 ఆరు నెలల కాలానికి రూ. 2లక్షలు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. 11 శాతం రాబడి ఆశిస్తున్నాను. నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నా డబ్బులను తీసుకునే వీలుండాలి. తగిన పెట్టుబడి మార్గాలు సూచించండి.
 - అనిత, కాకినాడ
 
 మీరు కోరుకుంటున్న విధానాల్లో 11 శాతం రాబడి ఆర్జించడం సాధ్యమయ్యే అవకాశాలు తక్కువ. ఆర్నెల్ల కాలానికి రూ.2 లక్షలు ఇన్వెస్ట్‌మెంట్‌పై ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు డబ్బులు వెనక్కి తీసుకునే పరిస్థితుల్లో రాబడి 11 శాతం కంటే తక్కువగానే వచ్చే అవకాశాలున్నాయి. ఒక్క రాబడి విషయంలో తప్ప మీరు కోరుకున్న ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు లిక్విడ్ ఫండ్స్(వీటిని ఆల్ట్రా షార్ట్-టెర్మ్ బాండ్ ఫండ్‌గా వ్యవహరిస్తారు)లో ఉన్నాయి. ఈ లిక్విడ్ ఫండ్స్ 61 రోజుల మెచ్యూరిటీ ఉండే రుణ పత్రాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కాగా ఆల్ట్రా షార్ట్‌టెర్మ్ ఫండ్స్ సగటు మెచ్యురిటీ కాలం ఒక సంవత్సరంగా ఉంటుంది. 8-9 శాతం రాబడులు రావచ్చు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీ సొమ్ములు తీసుకోవచ్చు. ఇది సమంజసమైన సురక్షిత పెట్టుబడి విధానం కూడా.
 
 యాక్సిస్ లాంగ్-టెర్మ్ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఈ ఫండ్ ప్రారంభమై నాలుగేళ్లే అయినప్పటికీ, మంచి పనితీరు కనబరుస్తోంది. ఈ స్వల్ప కాలిక ట్రాక్ రికార్డ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చంటారా?
 - ప్రవీణ్, తిరుపతి
 
 ఈ ఫండ్ చెప్పుకోదగిన రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్‌కు ఫైవ్-స్టార్ రేటింగ్ ఉంది. ఈ ఫండ్ జనవరి, 2012-జనవరి, 2013 కాలానికి అత్యుత్తమ రాబడిని(దాదాపు 35 శాతం) ఇన్వెస్టర్లకు అందించింది. ఇప్పటికీ ఈ ఫండ్ మంచి పనితీరునే కనబరుస్తోంది. అత్యుత్తమ కంపెనీలపైననే ఈ ఫండ్ దృష్టి పెడుతోంది. ప్రస్తుతమున్న గడ్డు పరిస్థితుల్లో పాత ఫండ్స్ పనితీరు అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో మంచి ఆదాయాన్ని ఈ ఫండ్ అందించింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే పెట్టుబడుల కోసం ఈ ఫండ్‌ను పరిశీలించవచ్చు.


-ధీరేంద్ర కుమార్

సీఈఓ ,వేల్యూ రీసెఅర్చ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement